Turmeric : పసుపు కొమ్ములు మంచిదా..? ప్యాకెట్ పసుపు మంచిదా…?

Turmeric  : పచ్చి పసుపు మంచిదా లేక పసుపు పౌడర్ మంచిదా…?ఈ రెండింటిలో ఆరోగ్యకరమైనది ఏది అనే సందేహం ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది. అయితే పసుపును మనం గోల్డెన్ స్పైసీగా పిలుస్తుంటాం.ఇక దీనిని కొన్ని దశాబ్దాలుగా ఆయుర్వేదంలోనూ , పాత శాస్త్రంలోనూ అలాగే వంటకాలలో విరివిగా ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే శక్తివంతమైన రంగు , విలక్షణమైన రుచితో పాటు ఈ పసుపు కేవలం రుచికోసం కాకుండా ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే […]

  • Published On:
Turmeric : పసుపు కొమ్ములు మంచిదా..? ప్యాకెట్ పసుపు మంచిదా…?

Turmeric  : పచ్చి పసుపు మంచిదా లేక పసుపు పౌడర్ మంచిదా…?ఈ రెండింటిలో ఆరోగ్యకరమైనది ఏది అనే సందేహం ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది. అయితే పసుపును మనం గోల్డెన్ స్పైసీగా పిలుస్తుంటాం.ఇక దీనిని కొన్ని దశాబ్దాలుగా ఆయుర్వేదంలోనూ , పాత శాస్త్రంలోనూ అలాగే వంటకాలలో విరివిగా ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే శక్తివంతమైన రంగు , విలక్షణమైన రుచితో పాటు ఈ పసుపు కేవలం రుచికోసం కాకుండా ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే పచ్చి పసుపు లేదా పసుపు పౌడర్ లలో దేనిని ఎంచుకోవాలి అనే విషయానికొస్తే చాలామంది ఏ రూపంలో ఉన్నా సరే పసుపు తీసుకుంటే ఆరోగ్యకరమని సూచిస్తున్నారు. కానీ ప్రస్తుత కాలంలో పెరిగిన ఆధునిక టెక్నాలజీ కారణంగా ప్రతిదీ కలుషితం అయిపోతుంది. ఈ క్రమంలోనే పసుపు పౌడర్ కూడా కలుషితమవుతుందని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పచ్చి పసుపు మంచిదా లేక పసుపు పౌడర్ మంచిదా అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

పోషకాలు…

పచ్చి పసుపు విటమిన్ సి విటమిన్ ఇ ఫైబర్ తో పాటు అనేక రకాల పోషకాలను సమృద్ధిగా కలిగి ఉంటుంది. అంతేకాక కర్కుమిన్ వంటి దాని సహజ నూనెలు చెక్కుచెదరకుండా ఉంటాయి. తద్వారా ఆరోగ్య ప్రయోజనానికి దోహదపడుతుంది. అయితే పసుపును పౌడర్ గా మార్చే ప్రాసెస్ లో కొన్ని రకాల పోషకాలు స్వల్ప నష్టానికి గురవుతాయట. పసుపును ప్రాసెసింగ్ చేసేటప్పుడు కడుపులో స్వల్ప నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్యాకెట్ పసుపు కంటే పచ్చి పసుపు కొమ్ములు ఎంతగానో మంచిదని చెబుతున్నారు.

అయితే వాస్తవానికి తాజా పసుపులో కర్కుమీన్ సహజ స్థితిలో ఉంటుంది. ఇక ఇది పండించే నేల నాణ్యత మరియు పంట కోత విధానం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. అందుకే పసుపు పొడిలో కర్కుమిన్ కంటెంట్ ను కచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పసుపును ప్రాసెసింగ్ చేసే సమయంలో ఇది తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి కొనే ముందు కర్కుమిన్ శాతం చెక్ చేసుకోవాలి. ఎది ఏమైనప్పటికీ ప్రస్తుత కాలంతో పోల్చి చూస్తే ప్యాకెట్ పసుపు కంటే పచ్చికొమ్ములు ఎంతగానో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.