Health Tips : ఉదయం , సాయంత్రం దీనిని త్రాగితే .. మోకాళ్ళ నొప్పులు జన్మలో రావు..

Health Tips : వయసు పెరిగే కొద్దీ ఎముకలలో బలం తగ్గి కొందరికి మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. దీనికి కొంతమంది శస్త్ర చికిత్స కూడా చేయించుకుంటారు. అయితే ఇవేమీ లేకుండా మోకాళ్ళ నొప్పులను మనం తినే ఆహారం ద్వారా తగ్గించుకోవచ్చు. అసలు సరైన సమయానికి ఆహారం తీసుకుంటూ, సరిపడా శరీరానికి శ్రమ ఉంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు. కానీ ప్రస్తుతం మారిన జీవన శైలి కారణంగా 30, 40 ఏళ్ల వాళ్లకే మోకాళ్ల నొప్పులు […]

  • Published On:
Health Tips : ఉదయం , సాయంత్రం దీనిని త్రాగితే .. మోకాళ్ళ నొప్పులు జన్మలో రావు..

Health Tips : వయసు పెరిగే కొద్దీ ఎముకలలో బలం తగ్గి కొందరికి మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. దీనికి కొంతమంది శస్త్ర చికిత్స కూడా చేయించుకుంటారు. అయితే ఇవేమీ లేకుండా మోకాళ్ళ నొప్పులను మనం తినే ఆహారం ద్వారా తగ్గించుకోవచ్చు. అసలు సరైన సమయానికి ఆహారం తీసుకుంటూ, సరిపడా శరీరానికి శ్రమ ఉంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు. కానీ ప్రస్తుతం మారిన జీవన శైలి కారణంగా 30, 40 ఏళ్ల వాళ్లకే మోకాళ్ల నొప్పులు వస్తున్నాయి. అటువంటి వారు ఈ హోమ్ రెమెడీస్ ఉపయోగించి మోకాలి నొప్పులను దూరం చేసుకోవచ్చు.

I'm a physiotherapist. This is what's behind your knee pain and how to treat it | Daily Mail Online

ఆవాల నూనెను ప్రతిరోజు నొప్పి ఉన్నచోట రెండు సార్లు రాస్తే ఉపశమనం పొందవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల ఆవాల నూనెలో ఒక వెల్లుల్లి, ఒక లవంగం వేసి దానిని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఈ నూనెను నొప్పి ఉన్న చోట రాయాలి. ఈ నూనెతో మోకాళ్లపై తరచుగా మసాజ్ చేస్తూ ఉండాలి. ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే మోకాళ్ల నొప్పులు క్రమక్రమంగా తగ్గిపోయి ఆరోగ్యవంతులుగా తయారవుతారు. అలాగే ఈ మోకాళ్ళ నొప్పులను తగ్గించుకోవడానికి కొబ్బరి నూనె కలబంద బాగా ఉపయోగపడతాయి. కొబ్బరి నూనె, కలబంద మిశ్రమాన్ని నొప్పి ఉన్నచోట రాస్తే మోకాళ్ళ వాపు తగ్గుతుంది.

అలాగే మెంతులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అవి కాస్తంత చేదుగా ఉన్న ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కొన్ని మెంతులను నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే వాటిని తినాలి. చేదుగా ఉన్నా సరే తప్పదు. అలాగే మెంతుల పేస్టును నొప్పి ఉన్నచోట రాస్తే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. మోకాలు నొప్పులు ఉన్నవారు క్యారెట్ జ్యూస్ ను ప్రతిరోజు తీసుకోవాలి. క్యారెట్ జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని ఉదయం, సాయంత్రం తాగడం వలన మోకాళ్ళ నొప్పులు దాదాపుగా తగ్గిపోతాయి. ఇలా ఇంట్లో ఉన్న రెమెడీస్ తోమోకాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు.