Hair Tips : 5 నిమిషాల్లో తెల్ల జుట్టును నల్లగా మార్చే చిట్కా ..

Hair Tips : ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యం కారణంగా చాలామంది జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాగే తినే ఆహారం సరిగ్గా లేకపోయినా జుట్టు సమస్యలు వస్తూ ఉంటాయి. తినే ఆహారం లో లోపం, వాతావరణం కలిగే మార్పుల వలన జుట్టు రాలిపోవడం, చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం, చుండ్రు, దురద వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే జుట్టు రాలిపోకుండా, తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి చాలామంది మార్కెట్లో దొరికే వివిధ రకాల ప్రొడక్ట్ లను […]

  • Published On:
Hair Tips : 5 నిమిషాల్లో తెల్ల జుట్టును నల్లగా మార్చే చిట్కా ..

Hair Tips : ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యం కారణంగా చాలామంది జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాగే తినే ఆహారం సరిగ్గా లేకపోయినా జుట్టు సమస్యలు వస్తూ ఉంటాయి. తినే ఆహారం లో లోపం, వాతావరణం కలిగే మార్పుల వలన జుట్టు రాలిపోవడం, చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం, చుండ్రు, దురద వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే జుట్టు రాలిపోకుండా, తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి చాలామంది మార్కెట్లో దొరికే వివిధ రకాల ప్రొడక్ట్ లను ఉపయోగిస్తుంటారు. వీటి వలన ఎటువంటి లాభం ఉండదు. దీంతోపాటు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే జుట్టును కాపాడుకోవడానికి సహజమైన పద్ధతిలో చేయగలిగే కొన్ని చిట్కాలు ఉన్నాయి.

గోరింటాకు తెల్ల జుట్టును నల్లగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. గోరింటాకు పొడిలో కాస్త పెరుగు, ధనియాలు, మెంతులు, కాఫీ పొడి, తులసి రసం, పుదీనా రసం వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పావుగంట పాటు ఉడికించాలి. రాత్రంతా అలా ఉంచి మరుసటి రోజు తలమాడుకు రాసుకుని మూడు గంటల తర్వాత తల స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. దీంతో తెల్ల జుట్టు ఈజీగా నల్లగా మారుతుంది.

తెల్ల జుట్టును నల్లజుట్టుగా మార్చడానికి బ్లాక్ టీ బాగా ఉపయోగపడుతుంది. పాలు కలుపుకోకుండా తయారుచేసిన బ్లాక్ టీలో కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుర్ల నుంచి చివర్ల దాకా అప్లై చేసి అరగంట దాకా అలా ఉంచి తర్వాత తల స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వలన తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అలాగే ఎటువంటి జుట్టు సమస్యలు రావు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు. అన్ని వయసుల వారు ఈ చిట్కాను ఉపయోగించవచ్చు.

కరివేపాకు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో బాగా సహాయపడుతుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును బలంగా చేయడంలో సహాయపడతాయి. అర కప్పు కరేపాకు, అరకప్పు మెంతి ఆకులు, కొద్దిగా నిమ్మరసం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని తలకు రాసుకుని అరగంట సేపు ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి. వారానికి రెండు మూడు సార్లు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.

Must Read : Lottery Ticket : రూ.100 లాటరీ టికెట్ తో కోట్లు గెలుచుకున్న ఓ వ్యక్తి ..