Green Chilli : పచ్చిమిర్చితో ఈ సమస్యలన్నింటికీ చెక్…

Green Chilli : భారతీయ వంటకాలలో పచ్చిమిర్చికి ప్రత్యేక స్థానం ఉంటుంది. కేవలం భారతదేశం అనే కాదు ఆసియా ఖండంలోనే పచ్చిమిర్చిని విరివిగా ఉపయోగిస్తుంటారు. కూరగాయల నుండి తినుబండారాల వరకు అన్నింటిలో మిరపకాయను కచ్చితంగా ఉపయోగిస్తారు. అంతేకాక ఈమధ్య చిల్లి చికెన్ వంటి ప్రత్యేక వంటకాలు కూడా తయారు చేస్తున్నారు. అయితే ప్రజలలో కూడా మిర్చి పై మంచి అవగాహన ఉంది. ఇది వంటకాలకు ఒక స్పెషల్ స్పైసీనెస్ యాడ్ చేస్తుంది కాబట్టి అందరూ దీనినే కోరుకుంటున్నారు. […]

  • Published On:
Green Chilli : పచ్చిమిర్చితో ఈ సమస్యలన్నింటికీ చెక్…

Green Chilli : భారతీయ వంటకాలలో పచ్చిమిర్చికి ప్రత్యేక స్థానం ఉంటుంది. కేవలం భారతదేశం అనే కాదు ఆసియా ఖండంలోనే పచ్చిమిర్చిని విరివిగా ఉపయోగిస్తుంటారు. కూరగాయల నుండి తినుబండారాల వరకు అన్నింటిలో మిరపకాయను కచ్చితంగా ఉపయోగిస్తారు. అంతేకాక ఈమధ్య చిల్లి చికెన్ వంటి ప్రత్యేక వంటకాలు కూడా తయారు చేస్తున్నారు. అయితే ప్రజలలో కూడా మిర్చి పై మంచి అవగాహన ఉంది. ఇది వంటకాలకు ఒక స్పెషల్ స్పైసీనెస్ యాడ్ చేస్తుంది కాబట్టి అందరూ దీనినే కోరుకుంటున్నారు. అయితే ఈ మిర్చిని తగిన మోతాదులో తీసుకోవడం వలన పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఓ పరిశోధనలో తేలింది. మరి ముఖ్యంగా ఈ మిర్చి వయసు తక్కువ కనపడేలా తోడ్పడుతుందట. అంతేకాక దీనివలన అదనంగా మరెన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

green-chilli-health-benefits

విటమిన్ రీచ్ ఐటమ్….

మన శరీరానికి కావాల్సిన పోషకాలు పచ్చిమిర్చిలో పుష్కలంగా లభిస్తాయి. మరి ముఖ్యంగా పచ్చిమిర్చి రోగ నిరోధక శక్తిని మెరుగుపరచటంలో తోడ్పడుతుంది. అలాగే చర్మ సంరక్షణకు తోడ్పడే మరియు కంటిచూపులు మెరుగుపరిచే విటమిన్ ఏ కూడా దీనిలో పుష్కలంగా లభిస్తుంది.

నొప్పి నివారణకి….

పచ్చిమిర్చి అనేది నొప్పి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కండరాల నొప్పి అర్థరేటిస్ చికిత్సలు ఉపయోగించే కొన్ని మెడిసిన్స్ లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారట.

జీర్ణ వ్యవస్థ…

పచ్చిమిర్చి పలు రకాల జీర్ణ రసాలను ప్రేరేపించి జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చూస్తుంది. అలాగే అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారు పచ్చిమిర్చి తినడం వలన వెంటనే ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణుల సలహా.

చర్మ సమస్యలకు….

పచ్చిమిర్చిలో బీటా కెరోటిన్ కాప్సిసిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరం దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తాయి. అలాగే దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు చర్మ సమస్యలను కూడా సులువుగా తగ్గిస్తాయి. చర్మంపై వచ్చే మొటిమలు మచ్చలు నివారణకు ఇది దివ్య ఔషధంలా పనిచేస్తుంది.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు