Yoga : గ్యాస్టిక్ అసిడిటీ ఈ యోగముద్రతో జీర్ణ సమస్యలన్నీ మాయం…

Yoga : ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్ గ్యాస్ ట్రబుల్స్ మరియు అసిడిటీ. ఇవి రావడానికి ముఖ్య కారణం సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం. దానివలన ఆహారం జీర్ణం కాకపోవడంతో అవి తగ్గడానికి చాలామంది చాలా రకాల మందులు వాడుతూ ఉంటారు. అయితే ఈ విధంగా టాబ్లెట్స్ వేసుకోవడం వలన వారికి భవిష్యత్తులో ఇబ్బంది కలిగి ప్రమాదం ఉంటుంది. అటువంటి వారి కోసమే లోకముద్రను ట్రై చేయాలి అని నిపుణులు పేర్కొన్నారు. అవి ఏంటో ఇప్పుడు మనం […]

  • Published On:
Yoga : గ్యాస్టిక్ అసిడిటీ ఈ యోగముద్రతో జీర్ణ సమస్యలన్నీ మాయం…

Yoga : ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్ గ్యాస్ ట్రబుల్స్ మరియు అసిడిటీ. ఇవి రావడానికి ముఖ్య కారణం సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం. దానివలన ఆహారం జీర్ణం కాకపోవడంతో అవి తగ్గడానికి చాలామంది చాలా రకాల మందులు వాడుతూ ఉంటారు. అయితే ఈ విధంగా టాబ్లెట్స్ వేసుకోవడం వలన వారికి భవిష్యత్తులో ఇబ్బంది కలిగి ప్రమాదం ఉంటుంది. అటువంటి వారి కోసమే లోకముద్రను ట్రై చేయాలి అని నిపుణులు పేర్కొన్నారు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన సమయంలో శరీరానికి సరిపడా ఆహారం తీసుకోవాలి. అయితే మంచి ఫుడ్ తీసుకోవడమే కాదు తీసుకున్న ఆహారం జీర్ణం కావడం కూడా ముఖ్యమే. అయితే మన బాడీ సక్రమంగా పని చేయాలంటే ఆహారం తోసుకోవాలి. లేదంటే మరేన్నో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలామంది జీవనాశ సమస్యలతో బాధపడుతూ ఉంటారు.

మారిన జీవనశైలి కావచ్చు లేదా ఆహార అలవాటు కావచ్చు. వీటి వలన జీర్ణాశయ సమస్యలు వస్తాయి. చాలామంది ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్స్ కడుపులో ఉబ్బరం, మలబద్ధకం, ఆసిడిటీ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం ఆహారం సరిగా తీసుకోకపోవడమే. అయితే ఆహారం సరిగ్గా జీర్ణం కాని వారి కోసం నిపుణులు ఒక యోగముద్రను తీసుకువచ్చారు. దీనిని రోజు ఆహారం తీసుకున్న తర్వాత డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దీని ద్వారా ఆహారం త్వరగా జీర్ణం కావడమే కాకుండా మీ పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేయడం కోసం ఆరోగ్య నిపుణులు సూచిస్తున్న యోగాసనం. ఇక అదేమిటంటే వజ్రసనంలో కూర్చుని మోషన్ ముద్ర వేయడం. యోగాసనాలలో తిన్న వెంటనే చేయగలిగే ఒక భంగిమనే ఈ వజ్రసనం అని చెప్పాలి. ఇక ఈ ముద్ర తిన్న తర్వాత వెంటనే చేయడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు మోషన్ ముద్ర ఎలా వేయాలంటే…

ముందుగా భోజనం చేసిన తర్వాత భద్ర ఆశ్రమం వేయాలి. మీ కుడి చేతి బొటనవేలు మరియు చూపుడు వేలు మధ్య వేలు ఒక దగ్గరికి తీసుకురావాలి. అలాగే ఎడమ చేతి బొటనవేలు , మధ్య వేలు ఒక దగ్గరికి తీసుకువచ్చి కూర్చోవాలి. ఇలా మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఈ ఆసనం ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత ఈ ఆసనాన్ని 15 నిమిషాల పాటు పెంచుతూ పోవడం ద్వారా మీరు మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ ముద్రను ప్రాక్టీస్ చేయడం ద్వారా గ్యాస్ మలబద్ధకం ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలా చేయడం ద్వారా ఎన్నో రకాల సమస్యలు తగ్గిపోతాయి. అయితే వికారం ఉపనవాయువు వంటి సమస్యల నుంచి బయటపడతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆసనం మీకు ఎలా వేయాలో తెలియనప్పుడు మీకు తెలిసిన వారి దగ్గర నుంచి నేర్చుకున్న తర్వాత దీనిని వేయాలి.

గమనిక : పైన పేర్కొన్న కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.