Storing Eggs In Fridge : కోడిగుడ్లను ఫ్రిజ్ లో స్టోర్ చేస్తున్నారా…తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం…

Storing Eggs In Fridge  : నేటి కాలంలో సాధారణంగా ప్రజలందరూ కోడిగుడ్లను ఫ్రిజ్లో లో ఉంచుతున్నారు. ఇక ఇది దాదాపుగా ప్రతి ఒక్కరి ఇంట్లో జరుగుతుంది. అయితే కోడిగుడ్లను ఫ్రిడ్జ్ లో ఉంచడం మంచిది కాదని మీలో ఎంతమందికి తెలుసు. కోడిగుడ్లను ఫ్రిజ్ లో నిల్వ చేయడం వలన ఉడకపెట్టినప్పుడు అవి పగిలిపోతాయి. అంతేకాక తరచుగా ఫ్రిజ్ లో కోడిగుడ్ల ను ఉంచడం వలన విపరీతమైన చలి కారణంగా గుడ్డులోని పోషకాలు నశిస్తాయి. అంతేకాక గుడ్డు […]

  • Published On:
Storing Eggs In Fridge  : కోడిగుడ్లను ఫ్రిజ్ లో స్టోర్ చేస్తున్నారా…తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం…

Storing Eggs In Fridge  : నేటి కాలంలో సాధారణంగా ప్రజలందరూ కోడిగుడ్లను ఫ్రిజ్లో లో ఉంచుతున్నారు. ఇక ఇది దాదాపుగా ప్రతి ఒక్కరి ఇంట్లో జరుగుతుంది. అయితే కోడిగుడ్లను ఫ్రిడ్జ్ లో ఉంచడం మంచిది కాదని మీలో ఎంతమందికి తెలుసు. కోడిగుడ్లను ఫ్రిజ్ లో నిల్వ చేయడం వలన ఉడకపెట్టినప్పుడు అవి పగిలిపోతాయి. అంతేకాక తరచుగా ఫ్రిజ్ లో కోడిగుడ్ల ను ఉంచడం వలన విపరీతమైన చలి కారణంగా గుడ్డులోని పోషకాలు నశిస్తాయి. అంతేకాక గుడ్డు పెంకు పై చాలా బ్యాక్టీరియా ఉంటుంది.

do-you-store-eggs-in-the-fridge

కాని ప్రజలు వాటిని తీసుకున్నప్పుడు కడగకుండానే ఫ్రిజ్ లో నిల్వ చేస్తున్నారు.  తద్వారా కోడి గుడ్డుపై ఉన్న బ్యాక్టీరియా ఇతర వస్తువులకు కూడా సోకే ప్రమాదం ఉంది. కావున గుడ్లను గది ఉష్ణోగ్రత వద్ద నిలువ చేయడం మంచిది. అయితే ఇప్పటికి కూడా మీరు కోడి గుడ్లను ఫ్రిజ్ లోనే నిల్వ చేయాలనుకుంటే కొన్ని పరిష్కారా మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి… రిఫ్రిజిరేటర్ లో ఉష్ణోగ్రతను తగ్గించి గుడ్లను ఉంచండి. దీనివలన గుడ్లు తాజాగా ఉండడంతో పాటు పాడవకుండా ఉంటాయి.

do-you-store-eggs-in-the-fridge

అలాగే గుడ్లను ఎక్కువ తేమ లేని ప్రాంతాలలో ఉంచడం మంచిది. అలాగే గుడ్లను ఫ్రిజ్లో స్టోర్ చేయాలనుకుంటే ముందుగా వాటిని శుభ్రంగా కడుక్కోవడం మంచిది. లేదా కోడిగుడ్లను కొనుగోలు చేసిన ప్యాకేజింగ్ లోనే నిల్వ చేయండి. ఒకవేళ ప్యాకేజింగ్ తెరిచి ఉంటే గుడ్లను గాలి చొరబడని వాటిలో నిల్వ చేయండి. తద్వారా దానిపై గల బ్యాక్టీరియా ఇతర వస్తువులకు సోకకుండా ఉంటుంది.

do-you-store-eggs-in-the-fridge

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.