Winter : చలికాలం జుట్టు సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారా…ఈ టిప్స్ పాటించండి.

Winter  : మిగతా రోజుల్లో పోలిస్తే చలికాలంలో జుట్టుకు వచ్చే సమస్యలు ఎక్కువ అని చెప్పాలి. వాతావరణంలో తేమశాతం తక్కువగా ఉండటం వలన ఈ కాలంలో జుట్టు పొడిబారుతుంది.తద్వారా వెంట్రుకలన్నీ కాంతిహీనంగా కనిపిస్తాయి. అలాగే జుట్టు యొక్క కుదుళ్ళు చిట్లిపోయి నిర్జీవంగా మారుతాయి.అయితే వాతావరణం లో జరిగే మార్పులకు అనుగుణంగా జుట్టు సంరక్షణ విషయంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం వలన జుట్టును కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే చలికాలంలో జుట్టు పొడిబారకుండా ఉండాలంటే ఏం చేయాలి…? […]

  • Published On:
Winter : చలికాలం జుట్టు సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారా…ఈ టిప్స్ పాటించండి.

Winter  : మిగతా రోజుల్లో పోలిస్తే చలికాలంలో జుట్టుకు వచ్చే సమస్యలు ఎక్కువ అని చెప్పాలి. వాతావరణంలో తేమశాతం తక్కువగా ఉండటం వలన ఈ కాలంలో జుట్టు పొడిబారుతుంది.తద్వారా వెంట్రుకలన్నీ కాంతిహీనంగా కనిపిస్తాయి. అలాగే జుట్టు యొక్క కుదుళ్ళు చిట్లిపోయి నిర్జీవంగా మారుతాయి.అయితే వాతావరణం లో జరిగే మార్పులకు అనుగుణంగా జుట్టు సంరక్షణ విషయంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం వలన జుట్టును కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే చలికాలంలో జుట్టు పొడిబారకుండా ఉండాలంటే ఏం చేయాలి…? ఎలాంటి చిట్కాలను ఉపయోగించాలి అనే విషయాలను నిపుణులు తెలియజేస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

are-you-facing-a-lot-of-hair-problems-in-winter-follow-these-tips

పొడిబారకుండా ఉండడానికిి చిట్కాలు…

  • చలికాలం వస్తే చాలు చాలామంది వేడి నీటితోనే స్నానాలు చేస్తుంటారు. ఈ క్రమంలో తల స్నానం కూడా వేడి నీటితోనే చేస్తున్నారు. దీని కారణంగా తలలో సహజ నూనెల ఉత్పత్తి తగ్గి జుట్టు పొడిబారినట్లుగా తయారవుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే నెలలో కేవలం రెండు మూడు సార్లు గోరువెచ్చని నీటితో తల స్నానం చేసి ఎక్కువ సమయాల్లో చల్లని నీటితో చేయడం ఉత్తమం. ఇలా చేయడం వలన జుట్టు పోషణను కోల్పోకుండా ఉంటుంది.
  • అలాగే చలికాలంలో షాంపూలు ఎక్కువగా ఉపయోగించడం వలన జుట్టు లో ఉండే సహజ నూనెలు తగ్గిపోతాయి. అందుకే వారానికి రెండు లేదా మూడుసార్లు మాత్రమే షాంపును వినియోగించాలి.
  • అయితే షాంపు ని ఉపయోగించిన తర్వాత కచ్చితంగా కండిషనర్ ను ఉపయోగించాలి. కండిషనర్ ను ఉపయోగించడం వలన జుట్టు హైడ్రేట్ గా ఉండి మెరుస్తూ ఉంటుంది.
  • ఇక చిట్కాల విషయానికొస్తే జుట్టు మృదువుగా కాంతివంతంగా మార్చడానికి బియ్యం పిండి, పాలు , తేనే సహాయపడతాయి. అయితే ఈ మూడింటిని తీసుకుని మిశ్రమం తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న మిశ్రమాన్ని తలకు పట్టించి దాదాపు 20 నిమిషాల తర్వాత శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వలన నిగనిగ లాడే జుట్టు మీ సొంతమవుతుంది.
  • అలాగే జుట్టు కుదుళ్లకు తగిన పోషణ లభించాలంటే ప్రతిరోజు నూనెతో తలకు మసాజ్ చేసుకొని తలస్నానం చేయాలి. కొబ్బరి నూనె, ఆర్గాన్ ఆయిల్ ,ఆలివ్ ఆయిల్ వంటివి ఉపయోగించడం వలన మంచి ఫలితాలు పొందవచ్చు.
  • అలాగే జుట్టు ఆరోగ్యం బాగుండేందుకు పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాలి. విటమిన్ బి 12 ,పోలిక్ యాసిడ్ , విటమిన్ డి ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ద్రువీకరించలేదు.