Knee Pain : చలికాలంలో మోకాళ్ళ సమస్యలు విపరీతంగా వస్తున్నాయా… డాక్టర్ సలహా ఏంటంటే…

Knee Pain : ప్రస్తుత కాలంలో చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య ఏదైనా ఉంది అంటే కీళ్ల నొప్పులు అని చెప్పాలి. సహజంగా అయితే వయసు పెరిగే కొద్ది కీళ్లు అరిగి కీలనొప్పులు వస్తుంటాయి. కానీ నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు మరియు వాతావరణం కారణంగా చాలామందిలో చిన్న వయసులోనే కీల సమస్యలు మొదలవుతున్నాయి. ఇక చలికాలం వచ్చిందంటే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే అసలు మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం ఏంటి..? మరి […]

  • Published On:
Knee Pain : చలికాలంలో మోకాళ్ళ సమస్యలు విపరీతంగా వస్తున్నాయా… డాక్టర్ సలహా ఏంటంటే…

Knee Pain : ప్రస్తుత కాలంలో చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య ఏదైనా ఉంది అంటే కీళ్ల నొప్పులు అని చెప్పాలి. సహజంగా అయితే వయసు పెరిగే కొద్ది కీళ్లు అరిగి కీలనొప్పులు వస్తుంటాయి. కానీ నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు మరియు వాతావరణం కారణంగా చాలామందిలో చిన్న వయసులోనే కీల సమస్యలు మొదలవుతున్నాయి. ఇక చలికాలం వచ్చిందంటే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే అసలు మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం ఏంటి..? మరి వీటి నుండి చలికాలంలో ఎలా ఉపశమనం పొందాలి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మన శరీరంలో కాలుష్యం లేదా ప్రోటీన్ లోపం ఏర్పడినప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. మరి ఇలాంటి పరిస్థితులలో కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఈ సమస్య నుండి బయటపడవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పసుపు…

పసుపులో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి మోకాళ్ళ నొప్పులను చాలా వరకు తగ్గిస్తాయి. కావున ప్రతిరోజు తీసుకునే ఆహారంలో పసుపు చేర్చుకోవడం మంచిది. లేకుంటే గోరువెచ్చని పాలలో కాస్త పసుపు కలుపుకుని తాగిన మంచి ఫలితాలను పొందవచ్చు.

అల్లం…

భారతదేశంలోని ప్రతి ఇంట్లో అల్లం నిత్యం వినియోగిస్తుంటారు. ఇక దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేంటరీ లక్షణాలు మోకాళ్ళ నొప్పులను త్వరగా తగ్గిస్తాయి. కావున ప్రతి రోజు అల్లం లేదా సొంటి రూపంలో దీనిని తీసుకోవడం వలన కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

వెల్లుల్లి…

మన భారతీయ వంటకాలలో వెల్లులికి ప్రత్యేకమైన స్థానం ఉంటుందని చెప్పాలి. అలాంటి వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన ఈ సమస్యల నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

ఆకుకూరలు…

ఆకుకూరలలో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. కావున రోజు వారి ఆహారంలో వీటిని చేర్చుకోవడం వలన కీళ్ల నొప్పులను వాపులను త్వరగా తగ్గించుకోవచ్చు. బ్రోకలీ , పాలకూర వంటి ఆకుకూరలు మంచి ఎంపికలుగా చెప్పవచ్చు.

పండ్లు…

శరీరానికి కావాల్సిన మంచి పోషకాలను అందించడంలో పండ్లు ఎప్పుడు ముందు వరుసలో ఉంటాయి. కావున ప్రతిరోజు వివిధ రకాల పండ్లను తీసుకోవడం వలన మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి ఆపిల్ , బెర్రీస్, ఆఫ్రికాట్.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.