Health Tips : నీరు ఎక్కువగా తాగుతున్నారా….పరిమితి మించితే అమృతమైన విషయమే… తస్మాత్ జాగ్రత్త…

Health Tips  : మానవ శరీరంలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది. అలాగే సంపూర్ణ ఆరోగ్యం కోసం నిత్యం శరీరానికి సరిపడా నీరు తాగాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. తగినంత నీటిని తీసుకోవడం వలన శరీరం అలసిపోకుండా చురుగ్గా పనిచేస్తుంది. అయితే చాలామంది నీటిని తక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి అనుకుని పరిమితికి మించి తాగుతున్నారు. అయితే పరిమితికి మించి నీటిని తాగడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ మొత్తంలో నీటిని తాగడం […]

  • Published On:
Health Tips : నీరు ఎక్కువగా తాగుతున్నారా….పరిమితి మించితే అమృతమైన విషయమే… తస్మాత్ జాగ్రత్త…

Health Tips  : మానవ శరీరంలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది. అలాగే సంపూర్ణ ఆరోగ్యం కోసం నిత్యం శరీరానికి సరిపడా నీరు తాగాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. తగినంత నీటిని తీసుకోవడం వలన శరీరం అలసిపోకుండా చురుగ్గా పనిచేస్తుంది. అయితే చాలామంది నీటిని తక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి అనుకుని పరిమితికి మించి తాగుతున్నారు. అయితే పరిమితికి మించి నీటిని తాగడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ మొత్తంలో నీటిని తాగడం వలన వాటర్ ఇంటాక్సికేషన్ లేదా హైపోనాట్రేమియా అనే సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. అధిక నీటిని తీసుకోవడం వలన శరీరంలో ఎలక్ట్రోలైట్ లో సమతుల్యత సమస్య ఏర్పడుతుంది.

అంతేకాక నీటిని ఎక్కువగా తాగడం వలన మూతపిండాలపై ప్రభావం పడుతుంది. దీంతో మూత్రపిండాల పనితీరు సామర్థ్యం తగ్గడమే కాక వ్యర్ధాలను తొలగించే శక్తి కూడా నశిస్తుంది. అంతేకాక రక్తపోటు, తలనొప్పి ,మూర్చ, కోమ, శ్వాస, గంధరగోళం సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. అలాగే బరువు పెరగడం సమస్యను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అయితే నీటిని ఎక్కువ తీసుకుంటే ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకొని..రోజువారి అవసరం, బరువు ,కార్యచరణ స్థాయి, వాతావరణ పరిస్థితులను బట్టి నీటిని తీసుకోవాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు. సదరుగా ఓ వ్యక్తి రోజుకు 8 గ్లాసులు లేదా రెండు లీటర్ల నీరు తీసుకుంటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలా అని మరి తక్కువ నీటిని తీసుకుంటే శరీరం డిహైడ్రేషన్ కి గురవుతుంది. కాబట్టి వాతావరణ పరిస్థితులను బట్టి శరీరానికి సరిపడినంత నీటిని తాగడం మంచిది.