Breaking News : టూర్ కి వెళ్ళొస్తానని చెప్పిన కూతురు .. చివరికి ఎంత పని చేసిందో !!

Breaking News : ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. అతివేగం, మద్యం సేవించి నడపటం ఇలా పలు కారణాల వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు తెలుగు యువత మృతి చెందారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు యువత విహారయాత్రలకు వెళుతున్నామని చెప్పి కర్ణాటక వెళ్లారు. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం […]

  • Published On:
Breaking News : టూర్ కి వెళ్ళొస్తానని చెప్పిన కూతురు .. చివరికి ఎంత పని చేసిందో !!

Breaking News : ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. అతివేగం, మద్యం సేవించి నడపటం ఇలా పలు కారణాల వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు తెలుగు యువత మృతి చెందారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు యువత విహారయాత్రలకు వెళుతున్నామని చెప్పి కర్ణాటక వెళ్లారు. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం కారు ప్రమాదానికి గురైంది.

కర్ణాటకలోని కొప్పళ్ళ నుంచి గదగ మార్గంలో గోవా వైపు ప్రయాణిస్తుండగా వంతెనను కారు బలంగా ఢీ కొట్టింది. అతివేగంగా వస్తున్న కారు వంతెనని ఢీకొట్టడంతో నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువత దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో షణ్ముఖ్, వెన్నెల వర్తిని మరో గుర్తు తెలియని యువతి, యువకుడిగా గుర్తించారు. షణ్ముఖ్ హైదరాబాద్ లోని మియాపూర్లో నివాసం ఉంటున్నాడు. ఇతడు ఇటీవల బీటెక్ పూర్తి చేసి తన తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు.

 

accident photo

accident photo

ఇక వెన్నెల వర్ధిని హైదరాబాద్ జవహర్ లాల్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీలో బీఎఫ్ఏ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. స్నేహితులతో కలిసి గోవా టూర్ కి వెళుతున్నానని చెప్పి మియాపూర్లో ఒక కారు అద్దెకు తీసుకున్నారు. విహారయాత్రకు వెళ్తున్నానని తండ్రి తండ్రులకు చెప్పి వెన్నెల బయటకు వచ్చింది. టూర్ కి వెళ్లి ఇంటికి సంతోషంగా తిరిగి వస్తుందనుకున్న కూతురు శవంగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వీరందరూ కర్ణాటక రాష్ట్రంలో పర్యటక ప్రాంతాలకు వెళ్లి అక్కడి నుంచి గోవాకు వెళుతున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Must Read : Telangana Politics : జనాల్లో మార్కులు కొట్టేసేందుకు కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతున్న తెలంగాణ పార్టీలు ..