Karnataka : కర్ణాటకలో బయటపడిన నిధి..

Karnataka : మన భారతదేశం ఎన్నో పురాతన వైభవాలకి చిహ్నంగా చెబుతుంటారు. ఎంతోమంది మహారాజులు మన భారతదేశాన్ని పరిపాలించారు. ఈ క్రమంలోనే భారత దేశంలో ఎన్నో రాజ్యాలు కూడా వెలిశాయి. అవన్నీ జరిగి ఎన్నో సంవత్సరాల అవుతున్నప్పటికీ నేటి కాలంలో కూడా వాటికి సంబంధించిన గుర్తులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.ఇలాంటి వింతలు విడ్డూరాలను మనం భారతదేశంలో చాలానే చూసాం.అయితే తాజాగా అలాంటిదే ఓ ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది . అయితే ఇటీవల కర్ణాటకలోని దేవాలయ ప్రాంగణంలో […]

  • Published On:
Karnataka : కర్ణాటకలో బయటపడిన నిధి..

Karnataka : మన భారతదేశం ఎన్నో పురాతన వైభవాలకి చిహ్నంగా చెబుతుంటారు. ఎంతోమంది మహారాజులు మన భారతదేశాన్ని పరిపాలించారు. ఈ క్రమంలోనే భారత దేశంలో ఎన్నో రాజ్యాలు కూడా వెలిశాయి. అవన్నీ జరిగి ఎన్నో సంవత్సరాల అవుతున్నప్పటికీ నేటి కాలంలో కూడా వాటికి సంబంధించిన గుర్తులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.ఇలాంటి వింతలు విడ్డూరాలను మనం భారతదేశంలో చాలానే చూసాం.అయితే తాజాగా అలాంటిదే ఓ ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది . అయితే ఇటీవల కర్ణాటకలోని దేవాలయ ప్రాంగణంలో నిర్మాణ పనులు చేపడుతుండగా మట్టి కుండ ఒకటి బయటపడింది. ఇక దానిలో అత్యంత పురాతన బంగారు నాణేలు బయటపడడం గమనార్హం.

treasure-unearthed-in-karnataka

దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్లినట్లయితే… ఈ ఘటన కర్ణాటకలోని కొడగు జిల్లా వీరాజ్ పేటప్రాంతంలో చోటుచేసుకుంది. అదే ప్రాంతానికి చెందిన అనంతపూర్ లో టాటా కాఫీ కార్పొరేషన్ కు చెందిన కొన్ని కాఫీ తోటలు ఉన్నాయి. ఇక అదే ప్రదేశానికి దగ్గరలో పురాతన ఈశ్వర ఆలయం కూడా ఉంది. ఇక ఈ ఆలయ ప్రాంగణంలో పనులు చేస్తుండగా…కూలీలకు భూమి లోపల ఓ కుండ కనబడింది. ఇక ఆ కుండలో బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. ఇక ఇదే విషయాన్ని టాటా కాఫీ పామ్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేసి సమాచారం అందించారు.

దీంతో ఒక్కసారిగా ఈ విషయం దావనంల వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రజలు కూడా అక్కడకు చేరుకొని దానిని చూడచాగారు. ఇంతలోనే పోలీసులు కూడా భారీ సంఖ్యలో మోహరించారు. ప్రజలను నియంత్రించేందుకు ప్రయత్నించారు. ఇక ఈ నిధిని విరాట్ పేట తహసిల్దార్ సమక్షంలో ప్రజలందరూ చూసే విధంగా ఊరేగింపు నిర్వహించి కొడగు జిల్లా కలెక్టర్ కు ఈ నిధిని అందజేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఈ న్యూస్ స్థానికంగా మరియు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది ఇలా ఉండగా కర్ణాటకలో మరో ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని బెంగళూరు సుబ్రమణ్య స్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం తీవ్రచర్చనియాంశంగా మారింది. ఇక దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చ్చేపట్టారు.