Karnataka : కర్ణాటకను వణికిస్తున్న మంకీ ఫీవర్… ఇద్దరు మృతి…

Karnataka  : కర్ణాటక రాష్ట్రంలో మంకీ ఫీవర్ తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. అయితే ఇప్పటికే ఈ మంకీ ఫీవర్ కారణంగా ఇద్దరు మృతి చెందడం అందర్నీ భయాందోళనకు గురిచేస్తుంది. మృతుల్లో 18 సంవత్సరాల యువతి మరియు 79 సంవత్సరాల వృద్ధుడు ఉన్నట్లు సమాచారం. ఇక ఈ వివరాలను కర్ణాటక ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ రన్ దీప్ ఆదివారం రోజు తెలియజేశారు. శివ మొగ్గ జిల్లా హోసన్నగర తాలూకాకు చెందిన యువతీ అలాగే ఉడుపు జిల్లా […]

  • Published On:
Karnataka : కర్ణాటకను వణికిస్తున్న మంకీ ఫీవర్… ఇద్దరు మృతి…

Karnataka  : కర్ణాటక రాష్ట్రంలో మంకీ ఫీవర్ తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. అయితే ఇప్పటికే ఈ మంకీ ఫీవర్ కారణంగా ఇద్దరు మృతి చెందడం అందర్నీ భయాందోళనకు గురిచేస్తుంది. మృతుల్లో 18 సంవత్సరాల యువతి మరియు 79 సంవత్సరాల వృద్ధుడు ఉన్నట్లు సమాచారం. ఇక ఈ వివరాలను కర్ణాటక ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ రన్ దీప్ ఆదివారం రోజు తెలియజేశారు. శివ మొగ్గ జిల్లా హోసన్నగర తాలూకాకు చెందిన యువతీ అలాగే ఉడుపు జిల్లా మణిపాల్ కు చెందిన ఒక వృద్ధుడు ఈ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని వారు తెలియజేశారు.

అంతేకాక ఉత్తర కన్నడలో 34 శివమొగ్గ లో 12, చిక్క మొగులూరులో 3 కేసులు నమోదైనట్లుగా రన్ దిప్ తెలియజేశారు. అయితే శివమొగ్గ జిల్లాలో చికిత్స పొందుతున్న రోగుల వివరాలను తెలుసుకున్న ఆయన ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2,288 మంది నుండి నమూనాలను సేకరించి పరీక్షించగా వారిలో 48 మందికి మంకీ ఫీవర్ వచ్చినట్లుగా వారు తెలియజేశారు.

ఇక ఈ మంకీ ఫీవర్ బారిన పడిన వారిలో తీవ్రమైన జ్వరం ఒళ్ళు నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని రన్ దీప్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఈ వ్యాధి సోకకుండా వ్యాక్సిన్ వేయించేందుకుగాను ఐసిఎంఆర్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లుగా ఆయన తెలిపారు. అయితే ఈ వ్యాధిని ప్రధమదశలోని చికిత్స చేయించుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ వ్యాధి కోతులను కరిచే కీటకాలు మళ్లీ వచ్చి మనిషిని కుడితే సోకుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. కాబట్టి ప్రజలకు దీనిపై అవగాహన కల్పిస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.