Work from home : ఎంచక్కా ఇంట్లో కూర్చొని చేసే బిజినెస్ ఇదే .. వేలల్లో ఆదాయం ..

Work from home : చాలామంది సొంత బిజినెస్ చేయాలని కలలు కంటున్నారు. కానీ ఎటువంటి బిజినెస్ చేయాలో అర్థం కాక సతమతమవుతుంటారు. పెట్టుబడి పెట్టగలిగే స్తోమత ఉన్న ఎలాంటి బిజినెస్ చేయాలా అని ఆలోచిస్తుంటారు. అలాంటి వారికి ఈ బిజినెస్ బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇంట్లోని ఆడవాళ్లకు ఈ బిజినెస్ బాగా సెట్ అవుతుంది. ఎంచక్కా ఇంట్లో కూర్చుని సొంతంగా బిజినెస్ చేయవచ్చు. నెలకు వేలల్లో ఆదాయం పొందవచ్చు. కాస్త శ్రమ పడితే మీ బిజినెస్ […]

  • Published On:
Work from home : ఎంచక్కా ఇంట్లో కూర్చొని చేసే బిజినెస్ ఇదే .. వేలల్లో ఆదాయం ..

Work from home : చాలామంది సొంత బిజినెస్ చేయాలని కలలు కంటున్నారు. కానీ ఎటువంటి బిజినెస్ చేయాలో అర్థం కాక సతమతమవుతుంటారు. పెట్టుబడి పెట్టగలిగే స్తోమత ఉన్న ఎలాంటి బిజినెస్ చేయాలా అని ఆలోచిస్తుంటారు. అలాంటి వారికి ఈ బిజినెస్ బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇంట్లోని ఆడవాళ్లకు ఈ బిజినెస్ బాగా సెట్ అవుతుంది. ఎంచక్కా ఇంట్లో కూర్చుని సొంతంగా బిజినెస్ చేయవచ్చు. నెలకు వేలల్లో ఆదాయం పొందవచ్చు. కాస్త శ్రమ పడితే మీ బిజినెస్ ని ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఒకప్పుడు వయసు పైబడిన వారికి మాత్రమే డయాబెటిస్ వచ్చేది కానీ ఇప్పుడు 30 సంవత్సరాల వాళ్లకు కూడా డయాబెటిస్ వస్తుంది. ఈ వ్యాధికి ఎన్ని మందులు ఉన్నప్పటికీ ఆహారం డైట్ పాటించడం తప్పనిసరి. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో డయాబెటిస్ కు డైట్ నియమాలు పాటించడం అసాధ్యమే. దీన్నే మీరు ఒక చక్కని వ్యాపారంగా మార్చుకోవచ్చు. ఉద్యోగులు, వ్యాపార ఇతర పనుల్లో బిజీగా ఉండే వాళ్లకు డయాబెటిస్ థాలి అందించడం ద్వారా చక్కని ఆదాయం పొందవచ్చు. ముందుగా డయాబెటిస్ ఉన్నవారు ఏ ఆహారం తీసుకుంటే డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుందో తెలుసుకోవాలి. అందుకు తగ్గట్టుగానే లంచ్ ప్రిపేర్ చేయాలి.

ఉదాహరణకు డయాబెటిస్ ఉన్నవారు పిండి పదార్థాలు ఎక్కువగా తినకూడదు. అందుకే మామూలు బియ్యం కన్నా బ్రౌన్ రైస్ లేదా డయాబెటిస్ రైస్ తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే తీపి పదార్థాలు, నూనెలో వేయించిన వేపుడు, పచ్చళ్ళు తినకూడదు. మీకు అంతగా తెలియకపోతే న్యూట్రీషియన్ల సలహా తీసుకొని డయాబెటిస్ డైట్ ను తయారు చేసి సప్లై చేసుకోవచ్చు. ముందుగా మీరు ఆన్లైన్ ప్లాట్ఫారం ద్వారా డయాబెటిస్ ఉన్నవారికి డైట్ సప్లై చేస్తామని ప్రచారం చేయాలి. కస్టమర్స్ వచ్చిన తర్వాత డైట్ తయారుచేసి స్విగ్గి, జొమాటో లాంటి ఆన్లైన్ ప్లాట్ఫారం లో ఉంచితే మంచిది. అప్పుడు డయాబెటిస్ ఉన్నవారు ఈజీగా మీ ఫుడ్ ని ఆర్డర్ చేసుకుంటారు. మీ బిజినెస్ డెవలప్ అయితే మీకు 50,000 ఎటుపోవు.

Must Read : Flipkart Offers : రూ.1000 లా బ్రాండెడ్ ఇయర్ ఫోన్ కేవలం 200 కే .. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ..