Business Idea : సంపంగి సాగుతో నెలకు 50 వేల సంపాదన…

Business Idea : ప్రస్తుత కాలంలో పూలకి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. మరి ముఖ్యంగా అందరినీ ఆకర్షించే లిల్లీ పూల కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇక ఈ లిల్లీ పూలను సంపంగి పూలు అని కూడా పిలుస్తారు. తెల్లని రంగుతో కంటికి ఇంపైన ఆకర్షణీయంగా కనిపించే ఈ సంపంగి పూలను పూలదండ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలాగే తక్కువ పూలతో సులభంగా అందంగా పూలదండలు తయారు చేసేందుకు ఈ పూలు ఎంతగానో […]

  • Published On:
Business Idea : సంపంగి సాగుతో నెలకు 50 వేల సంపాదన…

Business Idea : ప్రస్తుత కాలంలో పూలకి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. మరి ముఖ్యంగా అందరినీ ఆకర్షించే లిల్లీ పూల కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇక ఈ లిల్లీ పూలను సంపంగి పూలు అని కూడా పిలుస్తారు. తెల్లని రంగుతో కంటికి ఇంపైన ఆకర్షణీయంగా కనిపించే ఈ సంపంగి పూలను పూలదండ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలాగే తక్కువ పూలతో సులభంగా అందంగా పూలదండలు తయారు చేసేందుకు ఈ పూలు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఈ సంపంగి పూలకు మార్కెట్లో ఏడాది పొడుగునా మంచి గిరాకీ ఉంటుంది. ఇక ఈ పూలు మంచి సువాసన కలిగి ఉండడంతో దీని కాడలను కూడా అలంకరణ కోసం విరివిగా ఉపయోగిస్తుంటారు. అంతేకాక ఈ లిల్లీ పూల నుండి సుగంధ తైలం కూడా తయారు చేస్తుంటారు.

50000-per-month-with-lily-cultivation-best-business-idea

అయితే ఈ లిల్లీ పూలను వ్యాపారంగా మలచుకొని ఓ రైతు అధిక మొత్తంలో లాభాలను అర్జిస్తున్నాడు. ఇక పూర్తి వివరాల్లోకెళ్తే సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ గ్రామ శివారులో వేణుగోపాల్ అనే రైతు లిల్లీ పూలను ఒక ఎకరంలో సాగు చేస్తూ వస్తున్నాడు. ఇక ఈ లిల్లీ పూల పంట రెండు నెలల్లో చేతికి వస్తుందట. అయితే ఈ లిల్లీ పూల పంటను ఒక్కసారి వేసినట్లయితే మూడు సంవత్సరాల పాటు దిగుబడి వస్తూనే ఉంటుంది. అయితే ఒక ఎకరాకు వారంలో రెండుసార్లు 20 నుంచి 30 కిలోల వరకు దిగుబడి వస్తుందట. ఈ విధంగా మార్కెట్లో విక్రయించి వారానికి దాదాపు 12 వేల రూపాయలు సంపాదించవచ్చని రైతు వేణుగోపాల్ పేర్కొన్నారు. అదేవిధంగా మార్కెట్లో లిల్లీ పూలకు మంచి డిమాండ్ ఉండడంతో నెలకు దాదాపు 50 వేల రూపాయలు సంపాదిస్తున్నట్లుగా రైతు తెలియజేస్తున్నాడు.

సాగు విధానం…

అయితే ఎవరైనా వ్యవసాయం వైపు ఆసక్తి ఉండి ఇలాంటివి చేయాలనుకుంటే లిల్లీ పూల సాగు మంచి లాభాలను తెచ్చిపెడుతుందని చెప్పాలి. అయితే లిల్లీ పూల సాగును ఒక ఎకరంలో ఢిల్లీ కాండం తీసుకొని పొడి మట్టిలో సాగు చేయాల్సి ఉంటుంది. కాండంలో నుంచి చిన్న చిన్న మొలకలు వచ్చి తర్వాత ఆ మొక్కలను పొడి మట్టిలో దాదాపు 30 రోజులు నాటిన మొలకలు వస్తాయని రైతు తెలియజేస్తున్నారు. ఇక రెండు వైపులా కాలువలు మాదిరిగా ఉంచి మధ్యలో డ్రిఫ్ట్ సిస్టం ద్వారా నీరు పారేలా చేయడం ద్వారా రెండు నెలల్లోనే పంట చేతికి వస్తుంది. ఇక దీని సాగు కోసం మరింత వివరాలు తెలుసుకోవాలంటే అనుభవజ్ఞులైన రైతులను కలిసి తెలుసుకోవడం మంచిది. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది వ్యవసాయం రంగంలోనే పెద్ద మొత్తంలో సంపాదిస్తూ రానిస్తున్నారు. అలాంటి వారికి ఇది ఒక మంచి ఉపాయమని చెప్పాలి.