Business Ideas : 5 వేల పెట్టుబడి తో నెలకు 30 వేలు సంపాదిస్తున్న రైతన్న…ఐడియా అదుర్స్ కదా…

Business Ideas  : ప్రస్తుత కాలంలో చాలామంది సొంతంగా వ్యాపారం చేయడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ చాలామంది పెట్టుబడి పెట్టే స్తోమత లేక వెనకడుగు వేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం పెట్టుబడి ఉన్నప్పటికీ ఎలాంటి వ్యాపారం చేస్తే మంచిదో అర్థం కాక తల పట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి వారి కోసం తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందగలిగే వ్యాపారాలు చాలానే ఉన్నాయి. అయితే ప్రస్తుతం చాలామంది యువత ఉద్యోగం రాకపోవడంతో వ్యవసాయం చేస్తూ సరికొత్త పద్ధతులను అవలంబిస్తూ […]

  • Published On:
Business Ideas : 5 వేల పెట్టుబడి తో నెలకు 30 వేలు సంపాదిస్తున్న రైతన్న…ఐడియా అదుర్స్ కదా…

Business Ideas  : ప్రస్తుత కాలంలో చాలామంది సొంతంగా వ్యాపారం చేయడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ చాలామంది పెట్టుబడి పెట్టే స్తోమత లేక వెనకడుగు వేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం పెట్టుబడి ఉన్నప్పటికీ ఎలాంటి వ్యాపారం చేస్తే మంచిదో అర్థం కాక తల పట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి వారి కోసం తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందగలిగే వ్యాపారాలు చాలానే ఉన్నాయి. అయితే ప్రస్తుతం చాలామంది యువత ఉద్యోగం రాకపోవడంతో వ్యవసాయం చేస్తూ సరికొత్త పద్ధతులను అవలంబిస్తూ వ్యవసాయ రంగంలో కూడా రాణిస్తున్నారు. పాతకాలం పద్ధతులను కాకుండా లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. చిన్నచిన్న ఐడియాలతో ఉన్నతంగా ఆలోచిస్తూ బిజినెస్ చేస్తూ ఎటువంటి టెన్షన్ లేకుండా సొంత ఊర్లోనే జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి ఓ రైతు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం.

a-farmer-who-earns-30-thousand-per-month-with-an-investment-of-5-thousand

అనకాపల్లి జిల్లా రావికమతం మండలం దొండపూడి గ్రామంలో గట్రెడ్డి శ్రీను అనే రైతు 5000 రూపాయలు పెట్టుబడితో పురుగుమందులను కొట్టే స్ప్రేయర్ తీసుకొని నెలకు 30,000 వరకు సంపాదిస్తున్నారు. రైతు పనిని సులువు చేస్తూ మరోవైపు తాను జీవనోపాధిని పొందుతున్నట్లుగా శ్రీను తెలియజేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కేవలం మూడు నెలల్లోని లక్ష రూపాయల వరకు సంపాదించినట్లు ఆయన తెలియజేశారు. అయితే గత ఐదు సంవత్సరాల నుండి శ్రీను వ్యవసాయం చేస్తూ తన స్ప్రేయర్ సహాయంతో ఇతర రైతుల పొలాలలో మందులు పిచికారి చేయడం జరుగుతుందట. ఇక దీనికి గాను ఎకరానికి కొంత మొత్తంలో శ్రీను ఆదాయాన్ని పొందుతున్నాడు. ఈ విధంగా రోజుకు వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తున్నట్టుగా శ్రీను చెప్పుకొచ్చారు. అయితే డిగ్రీ పూర్తయిన తర్వాత ఉద్యోగం రాకపోవడంతో శ్రీను తన తండ్రి బాటలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడట.

a-farmer-who-earns-30-thousand-per-month-with-an-investment-of-5-thousand

అదే తనువుగా తన పొలంలో వ్యవసాయం చేసుకుంటూనే ఒక స్ప్రేయర్ కొని దాని సహాయంతో గ్రామంలోని అందరి పొలాలకు మందులు పిచికారి చేస్తూ జీవితం సాగిస్తున్నారు. అలాగే సీజన్ లో మరింత ఆదాయాన్ని పొందుతున్నట్లుగా తెలియజేశారు. అంతేకాక ఎక్కువ మందులు పిచికారి చేయాలన్న సమయంలో తన స్నేహితులను కూడా తీసుకెళ్లి వారికి కూడా జీవనోపాధి కల్పిస్తున్నట్లుగా శ్రీను తెలియజేశారు. అయితే ప్రస్తుత కాలంలో డ్రోన్ ద్వారా కూడా మందులను పిచికారి చేసే విధానం వచ్చింది. ఇక ఈ డ్రోన్ సహాయంతో అతి తక్కువ సమయంలోనే పనిని పూర్తి చేయవచ్చు. దీనిని కూడా వ్యాపారం గా మార్చుకొని మంచి ఆదాయాన్ని పొందవచ్చు.