Business Idea : అన్ సీజన్ లో కూడా హైబ్రిడ్ క్యాబేజీ పండిస్తూ లక్షల సంపాదిస్తున్న రైతు…

Business Idea : ప్రస్తుత కాలంలో భారత దేశంలో చాలామంది ఆధునిక పద్ధతులను అవలంబించి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీహార్ కు చెందిన ఓ రైతు బిందు సేద్యం అనే పద్ధతి ద్వారా సీజనల్ కానీ సమయంలో కూడా క్యాబేజీని దండిగా పండిస్తున్నారు. సెమీ సీజనల్ వాతావరణంలో సాగు చేసేందుకు గాను పౌలిహౌజులు మరియు డ్రిప్ ఇరిగేషన్ వంటి పద్ధతులను ఉపయోగిస్తున్నారు . అయితే బీహార్ లోని కందర్ పూర్ గ్రామానికి […]

  • Published On:
Business Idea : అన్ సీజన్ లో కూడా హైబ్రిడ్ క్యాబేజీ పండిస్తూ లక్షల సంపాదిస్తున్న రైతు…

Business Idea : ప్రస్తుత కాలంలో భారత దేశంలో చాలామంది ఆధునిక పద్ధతులను అవలంబించి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీహార్ కు చెందిన ఓ రైతు బిందు సేద్యం అనే పద్ధతి ద్వారా సీజనల్ కానీ సమయంలో కూడా క్యాబేజీని దండిగా పండిస్తున్నారు. సెమీ సీజనల్ వాతావరణంలో సాగు చేసేందుకు గాను పౌలిహౌజులు మరియు డ్రిప్ ఇరిగేషన్ వంటి పద్ధతులను ఉపయోగిస్తున్నారు .

a-farmer-who-is-earning-lakhs-by-growing-hybrid-cabbage-even-in-off-season

అయితే బీహార్ లోని కందర్ పూర్ గ్రామానికి చెందిన హార్స్ ఓజా అనే రైతు కొన్ని ఆధునిక పద్ధతులను అనుసరించి పెద్ద ఎత్తున హైబ్రిడ్ క్యాబేజీ సాగు చేస్తున్నాడు. ఇక ఇలా వ్యవసాయం చేయడం వలన ఆ రైతుకు మంచి లాభాలు వస్తున్నాయి. ఇక ఈ హైబ్రిడ్ క్యాబేజీ ప్రత్యేకత ఏంటంటే సాధారణ పరిమాణం కంటే ఇది కాస్త పెద్దగా ఉంటుంది.అయితే ఈ ఆధునిక వ్యవసాయం అనేది డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని అనుసరించి చేస్తున్నారు. ఈ పద్ధతిని అనుసరించడం వలన నీరు సమయం మరియు డబ్బు కూడా చాలా ఆదా అవుతుందని రైతు తెలియజేస్తున్నాడు.

అయితే వారి ప్రాంతంలో సాంప్రదాయ వ్యవసాయంపై ఆసక్తి లేని ఈ రైతు కోట్లాది రూపాయలను ఖర్చు చేసి మరి హైడ్రోపోనిక్ ప్లాంట్లను నిర్మించుకున్నాడు. ఇక ఈ హైడ్రోపోనిక్ ప్లాంట్స్ లో వివిధ రకాల పంటలను పండిస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా తులసి ,పుదీనా, చెర్రీ ,టమాటోలు, క్యాబేజీ వంటివి పండిస్తున్నట్లు రైతు తెలియజేస్తున్నాడు. అయితే కేవలం 40 రోజుల్లోనే క్యాబేజీని పండించేలాగా ఈ రైతు ఓ ప్రణాళికను సిద్ధం చేసుకోవడం జరిగింది. ఇక ఈ ప్రణాళికను అనుసరించి రైతు హర్ష్ ఓజా పంటలు పండిస్తున్నట్లు తెలియజేస్తున్నాడు. ఈ క్రమంలోనే వాటిని విక్రయించి అధిక మొత్తంలో లాభాలను కూడా ఆర్జిస్తున్నాడు. అయితే ఈ రోజులో వ్యవసాయం చేయాలనుకునే వారికి ఈ రైతు స్టోరీ స్ఫూర్తి దాయకమని చెప్పాలి.