Business Idea : రోజుకు 3 గంటల పని…2 వేల సంపాదన…మామూలు ఐడియా కాదు గురు…!

Business Idea : ప్రస్తుత కాలంలో చాలామంది యువకులు ఉద్యోగాల కంటే కూడా స్వయం ఉపాధి కోసం ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఎంత ఉన్నత చదువులు చదివినా సరే సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలని ఆలోచన చేస్తున్నారు. రోజంతా ఒకరి కింద పని చేసే కన్నా సొంతంగా ఒక బిజినెస్ పెట్టుకుని దానికంటే మూడింతల సంపాదన చేసేందుకు మార్గాలు వెతుకుతున్నారు. ఇక దానికి అనుగుణమైన వ్యాపారాన్ని ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్పాలి. అలాంటి వారి కోసమే ఈ […]

  • Published On:
Business Idea : రోజుకు 3 గంటల పని…2 వేల సంపాదన…మామూలు ఐడియా కాదు గురు…!

Business Idea : ప్రస్తుత కాలంలో చాలామంది యువకులు ఉద్యోగాల కంటే కూడా స్వయం ఉపాధి కోసం ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఎంత ఉన్నత చదువులు చదివినా సరే సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలని ఆలోచన చేస్తున్నారు. రోజంతా ఒకరి కింద పని చేసే కన్నా సొంతంగా ఒక బిజినెస్ పెట్టుకుని దానికంటే మూడింతల సంపాదన చేసేందుకు మార్గాలు వెతుకుతున్నారు. ఇక దానికి అనుగుణమైన వ్యాపారాన్ని ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని చెప్పాలి. అలాంటి వారి కోసమే ఈ బిజినెస్ ఐడియాను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లినట్లయితే…

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన , మహమ్మద్ ఆఫ్రిది అనే యువకుడు హైదరాబాదు మహానగరంలో ఎంబీఏ పూర్తి చేశాడు. ఇక అక్కడే కొన్ని నెలలపాటు ఉద్యోగం కూడా చేశాడు. అయితే ఉద్యోగం అఫ్రీద్ కి ఏమాత్రం అసలు సంతృప్తి ఇవ్వలేకపోయింది. దీంతో స్వయం ఉపాధి మార్గం వెతుక్కునే దిశగా అడుగులు వేశాడు. ఈ క్రమంలోనే స్వగ్రామం గోదావరిఖని చేరుకుని ఫుడ్ కోట్ ప్రారంభించాడు. అయితే ప్రారంభం కొత్తలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆఫ్రిది అందరికీ మంచి నాణ్యతతో తక్కువ ధరలో ఆహారాన్ని అందించడంతో కొద్దిరోజుల్లోనే ఫుడ్ కోర్టు మంచి లాభాల బాట పట్టింది.ఇక ఈ ఫుడ్ కోర్ట్ లో లభించే స్నాక్స్ అన్నీ కూడా తన ఇంటి వద్దనే తయారు చేసుకునే వస్తారట. అంతేకాక ఆర్డర్ ప్రకారం కూడా రెసిపీలు తయారు చేసి ఇస్తారట. ఈ విధంగా ఆఫ్రిది ప్రతిరోజు 1500 వరకు పెట్టుబడి తో రోజుకు 2000 రూపాయలకు పైగా లాభం పొందుతున్నట్లుగా తెలియజేశాడు.

ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగం చేసే సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యే వాడినని కానీ సొంత బిజినెస్ పెట్టుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా రోజుకు మూడు గంటలు కష్టపడి అంతకంటే ఎక్కువగానే సంపాదిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇక ఈ స్నాక్స్ కోట్ లో లభించే ఆహారాల విషయానికొస్తే…చికెన్ మెమోస్ , ఫ్రై చికెన్ మెమోస్ , పాలక్ పన్నీర్ మోమోస్ , పావు బాజీ, పకోడీ బ్రెడ్ ఆమ్లెట్ వంటివి లభిస్తాయి.ఇక ఈ ఆఫ్రిది ఫుడ్ కోట్ అందరికి ఆదర్శం అని చెప్పాలి. అయితే చాలామందికి ఎంతో ఉన్నత చదువు చదివి రోడ్డుపై ఇలా చేయడం హేళనగా అనిపించవచ్చు కానీ ప్రశాంతమైన వాతావరణంలో అలాంటి ఒత్తిడి లేకుండా సంపాదిస్తున్న నన్ను చూసి అందరూ నేర్చుకోవాలని ఆఫ్రిది అంటున్నారు. మరి ఆఫ్రిది గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.