Chaitanya Master : మాస్టర్ కు రావాల్సిన పేమెంట్ ఆపేశారు…అందుకే అప్పులు చేశారు..అసలు నిజం బయటపెట్టిన కండక్టర్ ఝాన్సీ…

Chaitanya Master : తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రముఖ డాన్స్ లో కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న చైతన్య మాస్టర్ ఆదివారం రోజున నెల్లూరు క్లబ్ హోటల్లో బలాన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఆత్మహత్యకు ముందు తాను అప్పుల బాధ భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు వీడియో తీశారు చైతన్య. చైతన్య మాట్లాడిన ఆఖరి మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ […]

  • Published On:
Chaitanya Master : మాస్టర్ కు రావాల్సిన పేమెంట్ ఆపేశారు…అందుకే అప్పులు చేశారు..అసలు నిజం బయటపెట్టిన కండక్టర్ ఝాన్సీ…

Chaitanya Master : తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రముఖ డాన్స్ లో కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న చైతన్య మాస్టర్ ఆదివారం రోజున నెల్లూరు క్లబ్ హోటల్లో బలాన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఆత్మహత్యకు ముందు తాను అప్పుల బాధ భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు వీడియో తీశారు చైతన్య. చైతన్య మాట్లాడిన ఆఖరి మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సంఘటనతో బుల్లితెర మూగబోయింది. ఈ నేపథ్యంలో బుల్లితెరపై గుర్తింపు సంపాదించుకున్న కండక్టర్ ఝాన్సీ చైతన్య మాస్టర్ ఆత్మహత్యపై సంచలన వ్యాఖ్యలను చేసింది.

they-stopped-the-payment-due-to-the-master-thats-why-they-got-into-debt-conductor-jhansi-revealed-the-real-truth

సాధారణంగా ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారని కానీ ప్రోగ్రామ్స్ కి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదంటూ కండక్టర్ ఝాన్సీ కామెంట్ చేసింది. ఆమె మాట్లాడుతూ….చైతన్య మాస్టర్ ఆత్మహత్య చేసుకున్నట్లు మేము ఒంగోలు ఈవెంట్ కి వచ్చినప్పుడు తెలిసింది. మాస్టర్ ఒకసారి అందరితో కూర్చుని మాట్లాడితే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో. ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల మాస్టర్ అమ్మా ,నాన్న, చెల్లి చాలా బాధపడుతున్నారు. తోటి కళాకారులకు అప్పు ఇవ్వాల్సి ఉంటే దాని గురించి డిస్కషన్ చేసి ఉంటే బాగుండేది. చాలామంది మాస్టర్ తో కలిసే జర్నీని స్టార్ట్ చేశారు. నా పరిస్థితి ఇలా ఉంది అని ఒక మాట చెప్పి ఉంటే వారు సహాయం చేసేవారు. అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవడం సరికాదన్నయ్య.. ఎందుకు ఇంత పని చేశావు. చైతన్య మాస్టర్ చాలా మంచివాడు.తనకున్న లేకున్నా పక్క వాళ్లకు మాత్రం సాయం చేస్తాడు.

they-stopped-the-payment-due-to-the-master-thats-why-they-got-into-debt-conductor-jhansi-revealed-the-real-truth

అయితే డిసెంబర్ 31న కండక్ట్ చేసిన ప్రోగ్రాంలో కొంతమంది ఆర్టిస్టులు చైతన్య మాసరుకు హ్యాండ్ ఇచ్చారు. దాంతో ఆ ప్రోగ్రాం నిర్వాహకులు మాస్టర్ అమౌంట్ను ఆపేశారు. దాదాపు 6, 7 లక్షలు ఉంటుందది. అయితే ఈ ప్రోగ్రాం లో అనుకున్న వాళ్లు రాకపోవడంతో కమిటీకి కూడా నష్టం వచ్చింది. ప్రోగ్రాం కి వచ్చిన వారికి కూడా డబ్బులు ఇవ్వలేదు. దాంతో చైతన్య మాస్టర్ అప్పు చేసి మరి వాళ్ళకి పేమెంట్స్ ఇచ్చారు. ఆర్గనైజర్స్ ఇలా చేయకుండా ఉండుంటే ఇలా జరిగేది కాదేమో. ఆర్గనైజర్స్ కు నేను చెప్పుకునే విన్నపం ఒక్కటే. మా ఒంట్లో బాగున్నా బాలేకపోయినా కష్టపడి స్టేజ్ పై పర్ఫామెన్స్ చేస్తాం. మీకు నచ్చకపోతే మమ్మల్ని పిలవకండి. కానీ పర్ఫామెన్స్ చేశాక పేమెంట్స్ ఆపవద్దు. మీరు ఇలా చేయడం వలన డబ్బులు సరిపోక అప్పు చేసి వాళ్ళ తాకిడి తట్టుకోలేక చైతన్య మాస్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారంటూ కండక్టర్ ఝాన్సీ చెప్పుకొచ్చింది.