Dil Raju : దిల్ రాజు ఇంట్లో విషాదం…తరలివస్తున్న సినీ ప్రముఖులు…

Dil Raju  : తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖ నిర్మాత అయిన దిల్ రాజు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం సాయంత్రం ఆరోగ్యం మరింత విషమించడంతో ఆసుపత్రికి తరలించగా రాత్రి 8 గంటలకు తుది శ్వాస విడిచారు. దీంతో దిల్ రాజు తండ్రిగారి మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ,సెలబ్రిటీలు ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. […]

  • Published On:
Dil Raju : దిల్ రాజు ఇంట్లో విషాదం…తరలివస్తున్న సినీ ప్రముఖులు…

Dil Raju  : తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖ నిర్మాత అయిన దిల్ రాజు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం సాయంత్రం ఆరోగ్యం మరింత విషమించడంతో ఆసుపత్రికి తరలించగా రాత్రి 8 గంటలకు తుది శ్వాస విడిచారు. దీంతో దిల్ రాజు తండ్రిగారి మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ,సెలబ్రిటీలు ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. మరి కొందరు ప్రముఖులు దిల్ రాజు ఇంటికి చేరుకొని శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.

celebrity-emotional-visuals-at-producer-dil-raju-house

కాగా తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్ రాజు సిని ఇండస్ట్రీలో ఎన్నో భారీ బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించారు. ఇక నిర్మాత దిల్ రాజు అసలు పేరు వెంకటరమణారెడ్డి. చిన్నతనం నుండే వారి కుటుంబ సభ్యులు అంతా ఆయనని రాజు అని ముద్దుగా పిలవడంతో ఆయన పేరు రాజుగానే స్థిరపడిపోయింది. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆయన మొదట నితిన్ హీరోగా నటించిన “దిల్ ” సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.

celebrity-emotional-visuals-at-producer-dil-raju-house

ఇక ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అందుకోవడంతో ఆయన పేరు కాస్త దిల్ రాజుగా మారిపోయింది. అయితే నిర్మాత కాకముందు దిల్ రాజు సినీ డిస్ట్రిబ్యూటర్ గా కూడా పనిచేశారు. ఇక తెలంగాణలోని నిజామాబాద్ కు చెందిన దిల్ రాజు పై చదువుల కోసం నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయాడు. ఇక దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి తల్లి ప్రమీల. అలాగే దిల్ రాజుకు విజయ్ సింహారెడ్డి , నరసింహారెడ్డి అనే ఇద్దరు అన్నలు కూడా ఉన్నారు. దిల్ రాజ్ మొదటి భార్య అనితను పెళ్లిసుకోగా వారికి హర్షిత అనే కుమార్తె పుట్టింది. కానీ అనిత అనారోగ్యంతో 2020లో మరణించగా దిల్ రాజు తేజస్విని అనే మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.