Chandra Mohan : కంటతడి పెట్టిస్తున్న చంద్రమోహన్ చివరి మాటలు…

Chandra Mohan  : ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ మరణంతో తెలుగు సినీ పరిశ్రమ లో విషాదఛాయలు అలుముకున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న చంద్రమోహన్ ఈరోజు ఉదయం ( నవంబర్ 11 ) కన్నుమూశారు. అయితే చంద్రమోహన్ గారు చిట్ట చివరిగా కళాతపస్వి కే.విశ్వనాథ్ గారు మరణించినప్పుడు మీడియాతో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 2న దిగ్గజ దర్శక నటుడు కె విశ్వనాథ్ గారు మరణించిన విషయం […]

  • Published On:
Chandra Mohan : కంటతడి పెట్టిస్తున్న చంద్రమోహన్ చివరి మాటలు…

Chandra Mohan  : ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ మరణంతో తెలుగు సినీ పరిశ్రమ లో విషాదఛాయలు అలుముకున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న చంద్రమోహన్ ఈరోజు ఉదయం ( నవంబర్ 11 ) కన్నుమూశారు. అయితే చంద్రమోహన్ గారు చిట్ట చివరిగా కళాతపస్వి కే.విశ్వనాథ్ గారు మరణించినప్పుడు మీడియాతో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

chandramohans-last-words

అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 2న దిగ్గజ దర్శక నటుడు కె విశ్వనాథ్ గారు మరణించిన విషయం తెలిసిందే. అయితే చంద్రమోహన్ పెదనాన్న కొడుకే విశ్వనాథ్. అన్నయ్య మరణించడంతో చంద్రమోహన్ ఎంతగానో కుంగిపోయారు. విశ్వనాథ్ గారి పార్థివ దేహాన్ని చూసి తల్లడిల్లిపోయారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి కూడా లోనయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కె విశ్వనాథ్ గారు మా పెదనాన్న కొడుకు..ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా నాకు కజిన్. ఇక మా మధ్య సినిమా బంధం కంటే కుటుంబ బంధమే ఎక్కువగా ఉండేది. వారికి ఇండస్ట్రీలో అందరికంటే కూడా నేనే చాలా దగ్గర వాడిని. అంతేకాదు అన్నయ్య నేను మద్రాస్ లో ఒకే చోట స్థలం కొనుక్కుని , ఇల్లు కట్టుకొని పాతికేళ్లు పక్కపక్కనే ఉన్నాం.

chandramohans-last-words

ఇక మా ఇద్దరి కాంబినేషన్ లో కూడా ఎంతో గర్వకారణమైన సినిమాలు వచ్చాయి. ఇక ఆ సినిమాలలో నన్ను అన్నయ్య అద్భుతమైన నటుడిగా చూపించడం జరిగింది. 1996లో విశ్వనాథ దర్శకుడిగా ఎస్పీ బాలు గాయకుడుగా నేను నటుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాము. అప్పటినుండి ఇప్పటివరకు మా మధ్య ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. మా అన్నయ్య మరణం మా కుటుంబానికి తీరని లోటు అంటూ చంద్రమోహన్ ఎమోషనల్ అయ్యారు. అలాగే ఎవరూ ఎక్కువ రోజులు ఉండరు కదా ఎప్పటికైనా అందరూ చనిపోవాల్సిందే అంటూ ఆయన మాట్లాడిన మాటలు చివరి మాటలుగా మిగిలిపోయాయి. అలాగే తన అన్నయ్య గురించి కంటతడి పెట్టుకున్న చంద్రమోహన్ వీడియో చివరి వీడియోగా మిగిలిపోయింది.