Astrology : 130 ఏళ్ల తర్వాత బుద్ధ పూర్ణిమ…ఈ రాశుల వారికి అరుదైన యోగం…

Astrology : హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాస పౌర్ణమిని బుద్ధ పూర్ణిమ అని కూడా అంటారు. బౌధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు జన్మించిన రోజు, మరియు జ్ఞానోదయం సూచించే ఈ పవిత్రమైన రోజు బౌద్ద మతస్తులకు అత్యంత ముఖ్యమైన పండుగ. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇదే రోజున ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం కూడా జరగబోతుంది. ఇక మే 5న వచ్చే ఈ బుద్ధ పూర్ణిమ చాలా ప్రత్యేకమైనదని […]

  • Published On:
Astrology : 130 ఏళ్ల తర్వాత బుద్ధ పూర్ణిమ…ఈ రాశుల వారికి అరుదైన యోగం…

Astrology : హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాస పౌర్ణమిని బుద్ధ పూర్ణిమ అని కూడా అంటారు. బౌధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు జన్మించిన రోజు, మరియు జ్ఞానోదయం సూచించే ఈ పవిత్రమైన రోజు బౌద్ద మతస్తులకు అత్యంత ముఖ్యమైన పండుగ. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇదే రోజున ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం కూడా జరగబోతుంది. ఇక మే 5న వచ్చే ఈ బుద్ధ పూర్ణిమ చాలా ప్రత్యేకమైనదని చెప్పబడుతుంది.

buddha-purnima-after-130-years-a-rare-yoga-for-these-zodiac-signs

దాదాపుగా 130 సంవత్సరాల తర్వాత బుద్ద పూర్ణిమ రోజున చంద్రగ్రహణం ఏర్పడనుంది. దీనివలన కొన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు రానున్నాయి. చంద్రగ్రహణ సమయంలో రాశుల కలయికతో అనేక రాశుల వారు ఆనందాన్ని పొందుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం యొక్క మొదటి చంద్రగ్రహణం మే 5 రాత్రి 8:47 నిమిషాలకు ప్రారంభమై తెల్లవారుజామున 1:00 కు ముగుస్తుంది. దీంతో సూర్యోదయం నుండి 9:16 వరకు సిద్ధి యోగం మరియు రోజు మొత్తం స్వాతి నక్షత్రం ఉంటుంది. దీనివలన కొన్ని రాశుల వారు సత్ఫలితాలను పొందుతారు. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి…

మేష రాశి వారికి ఈ రోజు చాలా ప్రత్యేకమైనది కానుంది. ఎందుకంటే ఈ రోజున సూర్యుడు మేషరాశిలో సంచరిస్తాడు. అలాగే చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఈ రాశిపై ప్రత్యేకంగా ఉంటుంది. దీని వలన చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ప్రారంభమవుతాయి. ఉద్యోగం మరియు వ్యాపారంలో ప్రయోజనాలను పొందుతారు.

కర్కాటక రాశి…

ఈ రాశి వారికి చంద్రగ్రహణం కూడా మంచిదని నిరూపించబడింది. సూర్యుడు మరియు బుధుడు కలయికతో ఏర్పడబోయే బుదాదిత్య యోగం ఈ రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే ఈ రాశి వారికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం లభిస్తుంది.

సింహరాశి…

బుద్ధ పూర్ణిమ రోజు సింహ రాశి వారికి ప్రత్యేక రోజు కానుంది. ఈ రోజున సూర్యుడు మేషరాశిలో ఉండటం వలన సింహరాశికి రవి అధిపతుడు అవుతాడు. దీంతో ఈ రాశి వారికి ప్రభావాలు సానుకూలంగా ఉంటాయి. వృత్తి వ్యాపార రీత్య ప్రయోజనాలు అందుకుంటారు.

గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ప్రజల విశ్వాసాలు మరియు ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.