Ashwini Nakshatra : అశ్విని నక్షత్ర మూడవ పాదంలో పుట్టిన మిథున రాశి వారి జాతకం…
Ashwini Nakshatra : అశ్విని నక్షత్రం మూడవ పాదం మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నక్షత్రాలు 27 ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి. అందులో మొదటిది అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం మూడవ పాదం గల వారి జాతకం ఎలా ఉండబోతుంది వారి గుణగణాలు ఎలా ఉంటాయి అశ్విని నక్షత్రం మూడవ పాదం వారు ఏ రాశికి చెందిన వారవుతారు.. వీరు జీవితంలో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అన్న విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మనకు […]
Ashwini Nakshatra : అశ్విని నక్షత్రం మూడవ పాదం మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నక్షత్రాలు 27 ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి. అందులో మొదటిది అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం మూడవ పాదం గల వారి జాతకం ఎలా ఉండబోతుంది వారి గుణగణాలు ఎలా ఉంటాయి అశ్విని నక్షత్రం మూడవ పాదం వారు ఏ రాశికి చెందిన వారవుతారు.. వీరు జీవితంలో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అన్న విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మనకు ఉన్న 27 నక్షత్రాలలో మొదటి నక్షత్రమైన అశ్విని నక్షత్రం మూడవ పాదం వారిది మిధున రాశి అవుతుంది. అంతేకాదు సాధారణంగా అశ్విని నక్షత్రం మూడవ పాదంలో పుట్టిన వారి పేరు చ అక్షరంతో మొదలవుతుంది.అశ్విని నక్షత్ర మూడవ పాదం రాశి లో ఉంటుంది. కాబట్టి మిధున రాశి అధిపతి బుధుడు వయసులకు అధిపతి కనుక మీరు క్రీడలకు వైద్యానికి సంబంధించిన వ్యాపారాల్లో కూడా చక్కగా రాణిస్తారు.
వీరు తమ వ్యవహారాలను మేధస్సును ఉపయోగించి పనులను చక్కబెట్టుకుంటారు. వీరు ఉద్యోగం వ్యాపారంలో కూడా రాణించగలరు. వైద్య పరమైన వ్యాపారం చేయడంలో ఆసక్తి కలిగి ఉంటారు. క్రీడలు వైద్య సంబంధిత వృత్తుల్లో అభివృద్ధిని సాధిస్తారు. వ్యవహార విషయాలను కూడా తమ సైన్ లో తెలియచేస్తారు. భవిష్యత్తు ప్రణాళిక చక్కగా చేస్తారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు ఉంటుంది. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు బంధు వర్గం సజాతి వారు ముఖ్యమైన సందర్భాల్లో మోసం చేస్తారు. జీవిత అనుభవం అనేక రంగాల గురించి అవగాహన చిన్నతనం నుంచి అలబడుతుంది. వివాహం సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. రాజకీయం పట్ల విపరీతమైన ఆసక్తిని కలిగి భవిష్యత్తుకు పునాదులుగా చేసుకొని ముందుకు సాగుతారు. తానుబడిన కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తారు.
శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతి కారం తీర్చుకోరు. సంతానంతో చక్కటి అనుబంధం ఉన్న తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నం మాత్రం చేయరు. సామర్ధ్యాన్ని నైపుణ్యాన్ని ఆలోచనలను ఇతరులను తెలుసుకొని ఇస్తారు. సమస్యలను పరిష్కరించే వ్యక్తులు సహకారం చెరుకుంటుంది. ప్రభుత్వపరంగా చట్టపరంగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకుంటారు. చేతికి అందిన ధనం వినియోగించుకోవడానికి చక్కటి మార్గాలను అన్వేషిస్తారు. అన్ని లెక్కలు రాతపూర్వకంగా లేకున్నా చక్కగా గుర్తు ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు కానీ సమస్యలకు దూరంగా పారిపోరు. చేయనటువంటి సాహసోపేతమైన పనులు చేసి విజయాలు సాధిస్తారు. కొన్ని సందర్భాలలో మొండి పట్టుదల కారణంగా జీవితంలో మీరు కొంత వరకు ఇబ్బందులను అధికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది.
మీరు పట్టిన కుందేలకు మూడే కాళ్లు అన్న చందంగా మీరు ఆలోచన ఉంటుంది. తాను చెప్పిందే వేదం తాను చెప్పిందే వినాలి అనే ధోరణితో ఉంటారు. ఎదుటి వ్యక్తులు ఏదైనా సలహాలు సూచనలు చేస్తున్నప్పుడు వాటిలో మంచి ఏదైనా ఉంటే దాన్ని పాటించడం మంచిదని వీరికి చెప్పదగిన సూచన. అలా కాదని ప్రవర్తిస్తే మొదటికే మోసం వస్తుంది. ఒక నిర్ణయం తీసుకుంటే దానికి సాధించే ప్రయత్నం చేయడు ఏదైనా ఒక మాట ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే ఒక పని ప్రారంభించేటప్పుడు కానీ కాస్త లోతు గా అధ్యయనం చేసిన తర్వాత దాని గురించి ఆలోచన చేయడం నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇక అదే విధంగా ఎదుటి వ్యక్తులకు ఎప్పుడైనా వాగ్దానం చేసేటప్పుడు కొంతవరకు మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులకు కావచ్చు బంధుమిత్రులకు కావచ్చు లేదా మీ సహ ఉద్యోగులతో కావచ్చు ఏదైనా వాగ్దానం చేసేటప్పుడు ఆలోచించి మాట ఇవ్వడం మంచిది. లేకపోతే ఇబ్బందులు తప్పవు.
గమనిక : పైన పేర్కొనబడిన కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. తెలుగు టాప్ న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.