YS Sharmila Fires On jagga reddy: ఎమ్మెల్యేగా ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే!

YS Sharmila Fires on jagga reddy: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కేటీఆర్ కోవర్ట్ అని, ఈ విషయం గాంధీ భవన్ మొత్తం తెలుసని ఆరోపించారు YSRTP అధ్యక్షురాలు YS షర్మిల . . YSR తనని పార్టీలోకి పిలిచారని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శలు చేసారు. అసలు వైఎస్సార్ పార్టీ మారాడా? ఎప్పుడు మారాడు? అంటూ ప్రశ్నల వర్షం సందించింది. పార్టీలు మారే ఖర్మ వైఎస్సార్‌కి పట్టలేదని కౌంటర్ ఇచ్చారు. ‘నీలా పార్టీలు మారి.. రాజకీయ […]

  • Published On:
YS Sharmila Fires On jagga reddy: ఎమ్మెల్యేగా ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే!

YS Sharmila Fires on jagga reddy:

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కేటీఆర్ కోవర్ట్ అని, ఈ విషయం గాంధీ భవన్ మొత్తం తెలుసని ఆరోపించారు YSRTP అధ్యక్షురాలు YS షర్మిల . . YSR తనని పార్టీలోకి పిలిచారని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శలు చేసారు. అసలు వైఎస్సార్ పార్టీ మారాడా? ఎప్పుడు మారాడు? అంటూ ప్రశ్నల వర్షం సందించింది. పార్టీలు మారే ఖర్మ వైఎస్సార్‌కి పట్టలేదని కౌంటర్ ఇచ్చారు.

‘నీలా పార్టీలు మారి.. రాజకీయ వ్యభిచారం చేసే సంస్కృతి వైఎస్ఆర్‌ది కాదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.వైఎస్సార్ గెలిచిన పార్టీనే కాంగ్రెస్‌లో కలిసిపోయిందన్నారు.మీలా పార్టీలు మారే అలవాటు YSR కి లేదన్న షర్మిల.. పొద్దున బీజేపీ , మధ్యాహ్నం కాంగ్రెస్ , సాయంత్రం TRS అంటూ ఎవరు పిలిస్తే అక్కడికి పోతావంటూ జగ్గారెడ్డిపై మండి పడ్డారు.

‘‘వైఎస్సార్ నీ శీలం కరాబు చేశాడా? పార్టీలు మారినందుకు ఎన్నిసార్లు శీలం దోచుకున్నారు జగ్గారెడ్డి?’’ అని కామెంట్స్ చేశారు. ఏ రోజైనా ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదని ప్రశ్నించావా? , సంగారెడ్డి ప్రజలకు కోసం ఏ రోజైనా గొడవ పడ్డవా ? . సంగారెడ్డికి జగ్గారెడ్డి వల్ల ఏమాత్రం లాభం లేదని.. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటేనని ఎద్దేవా చేశారు. ‘‘ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న నువ్వు.. రేపు ఏ పార్టీలో ఉంటాడో నీకే క్లారిటీ లేదు.. నువ్వా నా గురించి మాట్లాడేది’’ అంటూ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

Must Read : ‘రాజకీయానికి నేను దూరంగా ఉన్నాను.. నా నుంచి రాజకీయం దూరం కాలేదు’,వైరల్ అవుతున్న చిరంజీవి ట్వీట్..