YS Sharmila : పిసిసి అధ్యక్షురాలుగా తొలిరోజే జగన్ పై మండిపడ్డ షర్మిల…తప్పులను బయటపెడుతూ…

YS Sharmila  : ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే తాజాగా కానూరులో ఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షర్మిల మాట్లాడడం జరిగింది. ఇక ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి మరియు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అంతేకాక రాష్ట్ర విభజన జరిగినప్పటినుండి ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితులను ఆమె ప్రస్తావించారు. ప్రస్తుత రాష్ట్రంలో ఎక్కడ చూసినా […]

  • Published On:
YS Sharmila : పిసిసి అధ్యక్షురాలుగా తొలిరోజే జగన్ పై మండిపడ్డ షర్మిల…తప్పులను బయటపెడుతూ…

YS Sharmila  : ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే తాజాగా కానూరులో ఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షర్మిల మాట్లాడడం జరిగింది. ఇక ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి మరియు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అంతేకాక రాష్ట్ర విభజన జరిగినప్పటినుండి ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితులను ఆమె ప్రస్తావించారు. ప్రస్తుత రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోచుకోవడం దాచుకోవడమే కనిపిస్తుందని రోడ్లు వేయడానికి ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేదని చెప్పుకొచ్చింది. గత పది సంవత్సరాలుగా చూస్తే రాష్ట్రానికి కనీసం 10 పరిశ్రమలైన వచ్చాయా అని ప్రశ్నించింది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న అప్పులపై నిడదీసి అడగడం జరిగింది . అలాగే హోదా ఏమైంది జగన్ రెడ్డి అంటూ తన సొంత అన్నపై షర్మిల వీరుచుకుపడింది. అదేవిధంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ తో మోసం చేశాడని చెప్పుకొచ్చింది.

వైయస్సార్ ఆసియా సాధన కోసం తాను సిద్ధంగా ఉన్నానని తన తో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ కార్యకర్తలను షర్మిల పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా టిడిపి మరియు వైసీపీ పదేళ్ల పాలన గురించి కూడా షర్మిల వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల కాలంలో ఈ రెండు పార్టీల హయాంలో ఆంధ్ర రాష్ట్రానికి 10 లక్షల కోట్లకు అప్పు చేరిందని ఆమె తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్రంలో ఒక మెట్రో కూడా లేదని , ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటివరకు చెప్పుకునే స్థాయిలో ఏ డెవలప్మెంట్ జరగలేదని మండిపడింది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇస్తున్నారా అని ప్రశ్నించింది. ఇక జగన్ పాలనలో మాత్రం దళితులపై 100% దాడులు పెరిగాయని ఆమె తెలిపింది. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో లిక్కర్ మరియు మైనింగ్ మాఫియా ఉందని రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏమైంది అని ప్రశ్నించింది. ఇక బిజెపి పొత్తులో ఉన్న సమయంలో కూడా చంద్రబాబు దాదాపు 15ఏళ్ల పాటు స్టేటస్ కావాలని కోరారు..నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ రెడ్డి హోదా కోసం దీక్షలు చేశారు. వారి స్వలాభం కోసం వైసీపీ మరియు టిడిపి పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టాయని షర్మిల విమర్శించారు.

హోదా లేకుంటే చంద్రబాబు మరియు జగన్ పరిస్థితి ఏంటి అని అన్నారు. చంద్రబాబు అమరావతి పేరుతో గ్రాఫిక్స్ చూపించారని , ఇక జగన్ మూడు రాజధానులు పేరుతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఒక్క రాజధాని కూడా లేదని షర్మిల ఏద్దేవా చేశారు. అదేవిధంగా ఒకానొక సందర్భంలో టిడిపి మరియు వైసిపి బిజెపికి పొత్తులుగా ఎందుకు మారారని నిలదీశారు. ఈ రెండు పార్టీలు కూడా బిజెపి ఏం చెబితే దానికి గంగిరెద్దుల తల ఊపుతాయని వ్యాఖ్యానించారు. ఒక్క అంశం లోనైనా ఈ రెండు పార్టీలు బిజెపిని వ్యతిరేకించాయా అని ప్రశ్నించింది. దీంతో ప్రస్తుతం వైఎస్సార్ ఆశలన్నీ కాంగ్రెస్ తోనే ఉన్నాయని ఆమె స్పష్టం చేసింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు అందరూ కచ్చితంగా కాంగ్రెస్ తో చేతులు కలపాలని వైయస్సార్ ఆశయాలను సాధించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కార్యకర్తలకు షర్మిల పిలుపునిచ్చింది. పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల తొలిరోజే ప్రతిపక్షాలను తీవ్రస్థాయిలో విమర్శించడం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర పరిణామాలను తీసుకువస్తాయని చెప్పాలి.

https://youtu.be/PVTrZq7Ok5o