Kodali Nani : ఫ్లెక్సీలను తీసేసి అభిమానులను దూరం చేయలేరు… కొడాలి నాని..

Kodali Nani  : సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మరోసారి జూనియర్ ఎన్టీఆర్ మరియు నందమూరి ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నాయనే సంగతి బయటపడింది. అయితే నిన్న సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ సమీపంలో ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ప్లెక్సీలను అప్పుడే అక్కడికి విచ్చేసిన నందమూరి బాలకృష్ణ వెంటనే ఆ ఫ్లెక్సీలను తొలగించాలని టిడిపి నేతలకు ఆదేశించగా వెంటనే జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఫ్లెక్సీలను అక్కడ నుండి తొలగించారు. దీంతో […]

  • Published On:
Kodali Nani : ఫ్లెక్సీలను తీసేసి అభిమానులను దూరం చేయలేరు… కొడాలి నాని..

Kodali Nani  : సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మరోసారి జూనియర్ ఎన్టీఆర్ మరియు నందమూరి ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నాయనే సంగతి బయటపడింది. అయితే నిన్న సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ సమీపంలో ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ప్లెక్సీలను అప్పుడే అక్కడికి విచ్చేసిన నందమూరి బాలకృష్ణ వెంటనే ఆ ఫ్లెక్సీలను తొలగించాలని టిడిపి నేతలకు ఆదేశించగా వెంటనే జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఫ్లెక్సీలను అక్కడ నుండి తొలగించారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అయితే నిన్న తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్ మరియు కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు.

వారు వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ప్లెక్సీలను చూసి వెంటనే వాటిని తొలగించాల్సిందిగా ఆదేశించాడు. కారులో నుంచి దిగిన వెంటనే ఆ ఫ్లెక్సీలను చూసిన బాలయ్య తీయించూ వెంటనే తీయించూ అంటూ టిడిపి నేతలకు చెప్పడం ఒక వీడియోలో స్పష్టంగా రికార్డు అయింది. దీంతో ప్రస్తుతం ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం టిడిపి బహిరంగ సభల్లో కూడా ఎన్టీఆర్ చిత్రపటాలతో సీఎం ఎన్టీఆర్ సీఎం ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు కడుతున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఎన్టీఆర్ మౌనంగా ఉండిపోవడం , అదేవిధంగా సామాజిక మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం తో సోషల్ మీడియాలో మరియు టిడిపి వర్గాలలో రకరకాలుగా ఎన్టీఆర్ పై వ్యతిరేక వార్తలు వచ్చాయి.

ఇక అప్పటినుండి జూనియర్ ఎన్టీఆర్ కు మరియు నందమూరి ఫ్యామిలీకి మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. అయితే ఈ విభేదాలు అంతకు ముందు నుంచే ఉన్నాయో లేదా అప్పుడే మొదలయ్యేయో అనేది మాత్రం ఎవరికీ తెలియదు. అయితే తాజాగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పబ్లిక్ గా అందరి ముందే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలకృష్ణ తీపించి అవమానించడం చర్చానియాంశంగా మారింది. ఇక ఇదే విషయంపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఇటీవల మాట్లాడుతూ… ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయడం వలన ఆయనకు జరిగిన నష్టమేమీ లేదని.. వెయ్యి మంది బాలకృష్ణలు చంద్రబాబులు కలిసి వచ్చిన మమ్మల్ని ఏం చేయలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను కావాలనే సర్వనాశనం చేస్తున్నారని ఆయన విమర్శించారు. దీనికి తగిన ఫలితం ఖచ్చితంగా అనుభవిస్తారంటూ ఆయన తెలియజేశారు.