Free Bus Travel Scheme : ఆర్టీసీ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు…ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Free Bus Travel Scheme : తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం గురించి అందరికీ తెలిసిందే.దీనివలన చాలామంది మగవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఈ ఉచిత ప్రయాణం వలన ఆడవారి మధ్య కూడా గొడవలు మొదలయ్యాయి.భద్రాచలంలో ఓ బస్సులో ఇద్దరు మహిళలు జుట్టు పట్టుకొని మరి కొట్టుకున్నారు.బస్సులో జనమంతా చూస్తున్నా అవేమీ పట్టించుకోకుండా వారికి ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు.దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ మహిళలు ఎందుకు కొట్టుకున్నారో […]

  • Published On:
Free Bus Travel Scheme : ఆర్టీసీ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు…ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Free Bus Travel Scheme : తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం గురించి అందరికీ తెలిసిందే.దీనివలన చాలామంది మగవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఈ ఉచిత ప్రయాణం వలన ఆడవారి మధ్య కూడా గొడవలు మొదలయ్యాయి.భద్రాచలంలో ఓ బస్సులో ఇద్దరు మహిళలు జుట్టు పట్టుకొని మరి కొట్టుకున్నారు.బస్సులో జనమంతా చూస్తున్నా అవేమీ పట్టించుకోకుండా వారికి ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు.దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ మహిళలు ఎందుకు కొట్టుకున్నారో తెలిసిన నటిజనులు ఆశ్చర్యపోతున్నారు. అయితే తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం పై మహిళల నుంచి మంచి స్పందన లభించింది. ఉచిత బస్సు ప్రయాణం పథకం అమల్లోకి వచ్చిన మొదటి రోజే బస్సులన్ని మహిళలతో నిండిపోయాయి. దీనితో రాష్ట్రంలో టీఎస్ ఆర్టీసీ కి 100% ఆక్యుపేషన్ చేరుతుంది. ఎంత మంచి స్పందన వచ్చిన అన్ని సమస్య లే వస్తున్నాయి. ఉచిత ప్రయాణం వచ్చిన దగ్గర నుండి మహిళలందరూ ఉచిత ప్రయాణమే చేస్తున్నారు.

women-fight-in-rtc-bus-for-seat-in-bhadrachalam

దీనివలన ఆటో వారికి ఉపాధి కరువైంది.దానితో ఆటో యూనియన్ వాళ్లు ధర్నాలు చేపట్టారు.ఇదంతా ఒక ఎత్తు అయితే మహిళలకు ఉచిత ప్రయాణం ఏమో గాని మగవాళ్లకు పెద్ద చిక్కు వచ్చి పడింది.డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నప్పటికీ నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది.అటు మహిళలను సీట్ల నుండి లేపలేక ఇటు నిలబడలేక మగవారు బస్సు ప్రయాణం చేయడమే మానుకున్నారు.ఇంతవరకు మహిళలకు ఈ పథకం చాలా ఉపయోగపడిన ఇప్పుడు మాత్రం పెద్ద ఇబ్బందులకు గురిచేస్తుంది.ఎలా అంటే గతంలో వాటర్ ట్యాంకర్ల దగ్గర నీళ్ల కోసం కొట్టుకునే సీన్లు మరోసారి గుర్తు చేస్తున్నాయి. భద్రాచలంలో ఓ ఆర్టీసీ బస్సులో మహిళలు కొట్లాటకు దిగారు.నిన్న క్రిస్మస్ పండుగ కావడంతో మహిళలు ఎక్కువ ప్రయాణాలు చేశారు.ఈ విధంగానే సీట్ విషయంలో ఇద్దరు మహిళల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అది కాస్త కొట్టుకోవడం దాకా వెళ్ళింది .బస్సులో తోటి ప్రయాణికులు అందరూ చూస్తున్న కానీ వాళ్లు మాత్రం తగ్గేది లేదు అని ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని ఇష్టం వచ్చినట్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

 

View this post on Instagram

 

A post shared by KTR ARMY ✊️ (@ktr_army11)

ఈ గొడవను వీడియో తీసిన ప్రయాణికులు దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్త వైరల్ అయింది. అయితే గతంలోనూ ఇలా కొట్టుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. కానీ అప్పుడు డబ్బులు పెట్టి టికెట్లు తీసుకునేవారు. ఇప్పుడు ఉచిత ప్రయాణం చేస్తూ కూడా ఇలా కొట్టుకోవడం ఏంటి అని నేటిజనులు ముక్కున వెలు వేసుకుంటున్నారు.ఇలా ఉచిత ప్రయాణం అమలులో ఉన్న కర్ణాటకలోనూ మహిళలు ఒకరిని ఒకరు జుట్టు పట్టుకొని కట్టుకోవడం ఆశ్చర్యకరం.ఇక మగవారు అయితే ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తులు చేస్తున్నారు. డబ్బులు పెట్టి టికెట్లు తీసుకుని నిలబడాలంటే తమ వల్ల కావడం లేదని సర్కార్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫ్రీగా ప్రయాణం చేస్తున్నా ఆడవాళ్లు దర్జాగా సీట్లలో కూర్చుంటున్నారని తాము మాత్రం టికెట్లు తీసుకొని బస్సులో నిలబడే ప్రయాణం చేయాల్సి వస్తుందని వారు బాధపడుతున్నారు. మగవారి కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయించడం లేదా ప్రత్యేక బస్సులు వెయ్యడమో చెయ్యాలి అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు కోరుకుంటున్నారు.