Current Bill : ఉచిత కరెంటు ఎప్పుడు…! కరెంట్ బిల్స్ కొత్త రూల్స్ ఇవే…

Current Bill : తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇప్పటికే ప్రారంభమైంది. డిసెంబర్ 9న ప్రారంభమైన ఈ పథకానికి మహిళల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఉచిత ప్రయాణ సౌకర్యం ఓకే మరి ఉచిత విద్యుత్ ఎప్పటి నుంచి అనే ప్రశ్నలు ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ లపై చర్చ జరుగుతున్నది. ఇప్పటికే సోనియా గాంధీ బర్త్ డే కానుకగా మహాలక్ష్మి రాజీవ్ ఆరోగ్య పథకాలను ప్రకటించారు. మహాలక్ష్మి పథకం […]

  • Published On:
Current Bill  : ఉచిత కరెంటు ఎప్పుడు…! కరెంట్ బిల్స్ కొత్త రూల్స్ ఇవే…

Current Bill : తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇప్పటికే ప్రారంభమైంది. డిసెంబర్ 9న ప్రారంభమైన ఈ పథకానికి మహిళల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఉచిత ప్రయాణ సౌకర్యం ఓకే మరి ఉచిత విద్యుత్ ఎప్పటి నుంచి అనే ప్రశ్నలు ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ లపై చర్చ జరుగుతున్నది. ఇప్పటికే సోనియా గాంధీ బర్త్ డే కానుకగా మహాలక్ష్మి రాజీవ్ ఆరోగ్య పథకాలను ప్రకటించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు బస్సులు ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. అంతేకాకుండా రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద కుటుంబానికి 10 లక్షల రూపాయల బీమా అందిస్తున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే రెండు మొదలయ్యాయి. మిగతా నాలుగు ఎప్పుడు అమలు చేస్తారని ప్రజలు ఆత్రుత ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ హామీలలో గృహ జ్యోతి పథకం కూడా కీలకమైనది.

when-will-the-free-electricity-these-are-the-new-rules-for-your-current-bills

ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో ఈ హామీ కూడా ఓటర్లను బాగా ఆకర్షించింది. గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామని కాంగ్రెస్ సర్కార్ హామీ ఇవ్వడం జరిగింది. అయితే మధ్యతరగతి ప్రజలు చాలావరకు రెండు వందల యూనిట్ల కరెంటును వాడతారు అందువలన మధ్యతరగతి ప్రజలకు కరెంట్ బిల్లు సున్నా గా ఉండబోతుంది. ఈ నేపథ్యంలోనే గృహ జ్యోతి పథకం ఎప్పుడు అమలు చేస్తారని ప్రజల ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ నెలలో నే ఉంటుందా లేక ఇంకా సమయం పడుతుందా అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో మొదలవుతున్నాయి . వాస్తవానికి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధికారులు కరెంట్ బిల్లు పై మాట్లాడుతూ. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిసెంబర్ నుంచి కరెంట్ బిల్లు మాఫీ చేస్తామని ప్రకటించారు.  ఈ నేపథ్యంలోనే గృహ జ్యోతి పథకం వాదనలు వినిపిస్తున్నాయ.

మొత్తంగా ఈనెల కరెంట్ బిల్లు కట్టాలా వద్ద అనే కన్ఫ్యూజ్ లో ప్రజలు ఉన్నారు. అయితే అధికారులు మాత్రం గృహ జ్యోతి పథకం ఇంకా ప్రారంభం కాలేదని దానికి ఇంకా కొంచెం ఏం సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. అప్పటివరకు విద్యుత్ బిల్లులు కట్టాల్సిందిగా సూచిస్తున్నారు. ఇక ఈ ఉచిత విద్యుత్ పథకంపై పూర్తి సమీకరణలు ముగిసిన అనంతరం ఈ పథకాన్ని కూడా అమలు చేస్తామని కాంగ్రెస్ సర్కార్ తెలియజేస్తోంది. ఇప్పటికే ఇచ్చిన 6 , గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను ప్రారంభించి మంచి ఆదరణ పొందిన కాంగ్రెస్ సర్కార్ మిగతా నాలుగు గ్యారెంటీలను కూడా పూర్తిచేసి ప్రజలలో కాంగ్రెస్ పార్టీపై మంచి అభిప్రాయాన్ని తీసుకువచ్చే విధంగా అడుగులు వేస్తున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలలో వచ్చే లోటుపాట్లను కాంగ్రెస్ సర్కార్ ఎలా అధిగమిస్తుందో చూడాలి.