Khammam : మాకు బస్సు ఫ్రీ వద్దు టికెట్ ఇవ్వండి…మహిళ టీచర్లు నిర్ణయం …

Khammam  : ప్రస్తుతం ఫ్రీ రాజ్యం నడుస్తుంది. మొన్నటివరకు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అలగే ఒక వస్తువు కొంటె మరో వస్తువు ఫ్రీ ఉండేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ రావడంతో మహిళలకు బస్సుల్లో కూడా ఫ్రీ ప్రయాణం వచ్చింది. అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని కొందరు మహిళలు మాకు ఫ్రీ వద్దు టికెట్ తీసుకుంటామంటూ చెప్తున్నారు. తాజాగా ఓ పల్లెటూరు మహిళా టీచర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా మహిళా సాధికారతకు […]

  • Published On:
Khammam : మాకు బస్సు ఫ్రీ వద్దు టికెట్ ఇవ్వండి…మహిళ టీచర్లు నిర్ణయం …

Khammam  : ప్రస్తుతం ఫ్రీ రాజ్యం నడుస్తుంది. మొన్నటివరకు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అలగే ఒక వస్తువు కొంటె మరో వస్తువు ఫ్రీ ఉండేది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ రావడంతో మహిళలకు బస్సుల్లో కూడా ఫ్రీ ప్రయాణం వచ్చింది. అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని కొందరు మహిళలు మాకు ఫ్రీ వద్దు టికెట్ తీసుకుంటామంటూ చెప్తున్నారు. తాజాగా ఓ పల్లెటూరు మహిళా టీచర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

we-dont-want-bus-free-give-us-ticket-women-teachers-decide

తాజాగా మహిళా సాధికారతకు ఖమ్మం జిల్లాలోని కొందరు మహిళ ఉపాధ్యాయులు సరైనా నిర్వచనం చూపించారు. ఫ్రీగా దొరికితే చాలు ఏదైనా వాడుకుందామనుకునే ఈ రోజుల్లో స్వచ్ఛందంగా ఫ్రీ బస్ టికెట్ సర్వీస్ ఉపయోగించుకోకుండా ఈ అవకాశాన్ని పేదలకు వదిలేద్దామని వారు నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఖమ్మం రూరల్ మండలం ఎం.వెంకటయ్యపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉపాధ్యాయులు గత శనివారం డిసెంబర్ 16న కాంప్లెక్స్ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఇక ఈ మీటింగ్ లో వారందరూ కలిసి ఫ్రీ బస్ , ఫ్రీ టికెట్ ను ఉపయోగించుకోకూడదని డిసైడ్ అయ్యారు.

we-dont-want-bus-free-give-us-ticket-women-teachers-decide

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఈ సౌకర్యాన్ని వృద్ధులకు మరియు కాలేజీ పిల్లలకు వదిలేయాలని వారు నిర్ణయం తీసుకున్నారు. తద్వారా టిఎస్ఆర్టిసి భవిష్యత్తు కోసం అలాగే ఆటో డ్రైవర్ల కార్మికులకు ఉపాధి అందించిన వారు అవుతారని వారి ఆలోచనలు. ఉపాధ్యాయులందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రతిజ్ఞ చేశారు. మహిళా ఉపాధ్యాయులు తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రస్తుతం నేటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.