Yadhagiri Temple : కంపు కొడుతున్న యాదగిరి గుట్ట…పట్టించుకోని ప్రభుత్వం…

Yadhagiri Temple : తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కు సమీపంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువుదీరి ఉన్న కొండపై ఆలయ పరిసరాలన్నీ దుబ్బరంగా మారాయి. ఈవో ఆఫీస్ నుండి బుస్ బై వరకు ఉన్న సెల్లార్ ప్రాంతం మొత్తం దుర్వాసనతో నిండిపోయింది. అయితే దీనికి గల కారణం వాడుకలో లేని సెల్లార్ ఏరియాలలో స్థానికులు కాలకృతులు మరియు అనివార్య కార్యకలపాలకు వాటిని వినియోగించడంతో పరిసరాలు మొత్తం కంపు వాసన కొడుతున్నాయి. ముక్కు మూసుకుంటే తప్ప సెల్లార్ ప్రాంతాలలో తిరగలేని […]

  • Published On:
Yadhagiri Temple : కంపు కొడుతున్న యాదగిరి గుట్ట…పట్టించుకోని ప్రభుత్వం…

Yadhagiri Temple : తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కు సమీపంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువుదీరి ఉన్న కొండపై ఆలయ పరిసరాలన్నీ దుబ్బరంగా మారాయి. ఈవో ఆఫీస్ నుండి బుస్ బై వరకు ఉన్న సెల్లార్ ప్రాంతం మొత్తం దుర్వాసనతో నిండిపోయింది. అయితే దీనికి గల కారణం వాడుకలో లేని సెల్లార్ ఏరియాలలో స్థానికులు కాలకృతులు మరియు అనివార్య కార్యకలపాలకు వాటిని వినియోగించడంతో పరిసరాలు మొత్తం కంపు వాసన కొడుతున్నాయి. ముక్కు మూసుకుంటే తప్ప సెల్లార్ ప్రాంతాలలో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. మరి దీనికి గల కారణం ప్రభుత్వం మారడమా వేరే ఇతర కారణాలు ఉన్నాయనేది తెలియాల్సి ఉంది. దానికంటే ముందు ఆలయ ఆఫీసర్లు ఆలయ పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని భక్తుల సైతం కోరుకుంటున్నారు.

అయితే శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువుతీరి ఉన్న యాదగిరి కొండను తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ దానిపై దృష్టి సారించి అభివృద్ధి చేశారు. దీంతో ప్రస్తుతం ఆ ప్రాంతమంతా అభివృద్ధితో నిండిపోయింది. అంతేకాక బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ ఆలయ పరిసరాలు కూడా చాలా శుభ్రంగా కనిపించాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే ఆలయ దుస్థితి ఇలా మారడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.