CM Revanth Reddy : అద్దె ఇళ్లలో ఉండే వారికి కూడా ఉచిత విద్యుత్…

CM Revanth Reddy : 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ గృహ జ్యోతి పథకాని కసరత్తు , మార్గదర్శకాలు ఇవే అంటూ పలు వార్తలు వైరల్ గా మారాయి . ఈ నేపథ్యంలో వీటి పై టీఎస్ ఎస్.పి.డి.సి.ఎల్ క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి తీరుస్తూ ప్రజల మెప్పు పొందుతున్నారు. అయితే ప్రస్తుతం గృహ జ్యోతి పథకంపై కసరత్తు చేసి […]

  • Published On:
CM Revanth Reddy : అద్దె ఇళ్లలో ఉండే వారికి కూడా ఉచిత విద్యుత్…

CM Revanth Reddy : 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ గృహ జ్యోతి పథకాని కసరత్తు , మార్గదర్శకాలు ఇవే అంటూ పలు వార్తలు వైరల్ గా మారాయి . ఈ నేపథ్యంలో వీటి పై టీఎస్ ఎస్.పి.డి.సి.ఎల్ క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసిన సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి తీరుస్తూ ప్రజల మెప్పు పొందుతున్నారు. అయితే ప్రస్తుతం గృహ జ్యోతి పథకంపై కసరత్తు చేసి ప్రజలకు ఉచిత కరెంటు ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. సంక్షేమ పథకాల కోసం ప్రజా పాలన అభయస్థం పేరుతో ఊరురా అప్లికేషన్లు తీసుకున్న గవర్నమెంట్ ఇప్పుడు అప్లికేషన్స్ పరిశీలన చేస్తుంది. పథకాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ షురూ చేసి వేగంగా అడుగులు వేస్తున్నారు. సీఎం ప్రజా పాలనలో స్వీకరించిన ఐదు గ్యారంటీలు సంబంధించి డేటా ఎంట్రీ కూడా పూర్తయింది.

ఈ నేపథ్యంలో నెట్టింటా పలు కథనాలు మొదలయ్యాయి. గృహ జ్యోతి పథకం పై ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయాలు సమాచారాలు చక్కెరలు కొడుతున్నాయి. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ గృహ జ్యోతి పథకానికి కసరత్తులు షురూ అంటూ పలు వార్తలు వైరల్ గా మారాయి. వైట్ రేషన్ కార్డు ఉంటేనే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తుందని కిరాయికి ఉండే వాళ్ళు ఈ పథకానికి అనర్హులు అని చెబుతూ సోషల్ మీడియాలో వార్తలు షికారులు చేస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ ఇస్తూ టీఎస్ పిడిఎస్ అధికారం గా ట్వీట్ చేసింది. ఇక ఈ ట్వీట్ లో కిరాయికి ఉండే వాళ్లకి ఉచిత కరెంట్ పథకం అమలు జరుగుతుందని తెలిపారు.

అదేవిధంగా గృహ జ్యోతి విషయంలో వైరల్ అవుతున్న సమాచారాలు ఫేక్ అని తెలిపారు. ఇటీవల 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ కి తెలంగాణ క్యాబినెట్ లో ఆమోదం లభించింది. దీనితో లబ్దిదారులను ఎలా ఎంపిక చేయాలి అనే దానిపై ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంది. అర్హత ఉన్న ప్రతి ఇంటికి ఫ్రీ కరెంట్ అందాలని సన్నాహాలు చేస్తున్నారు ఉచిత విద్యుత్ పొందాలి అనుకునేవారికి ఎలాంటి బకాయిలు . కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ఆరు గ్యారెంటీలో భాగంగా గ్యాస్ సిలిండర్ 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకాలను ప్రారంభించనున్నారు. వచ్చే నెల నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలు కానుంది అని సమాచారం. అంటే వచ్చే నెల నుంచి మీరు కరెంటు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు అన్నమాట. అయితే దీనికి ప్రభుత్వం కొన్ని కండిషన్స్ పెట్టనున్నట్లు సమాచారం.