Holiday : ఫిబ్రవరి 8న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం…ఎందుకో తెలుసా…
Holiday : తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి 8వ తేదీన సెలవు ప్రకటించడం జరిగింది. అయితే ఈ సెలవును సబ్ ఇ మెరాజ్ పండుగ సందర్భంగా ఇస్తున్నట్లు తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అయితే ప్రభుత్వం రిలీజ్ చేసిన క్యాలెండర్ లో ఫిబ్రవరి 8న సబ్ ఇ మెరాజ్ కి సెలవు ప్రకటించడం జరిగింది. అయితే దీనిని సాధారణ సెలవు కింద కాకుండా ఐచ్చిక సెలవ కింద పేర్కొనడం జరిగింది. కానీ ఇప్పుడు దీన్ని సాధారణ సెలవుగా […]
Holiday : తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి 8వ తేదీన సెలవు ప్రకటించడం జరిగింది. అయితే ఈ సెలవును సబ్ ఇ మెరాజ్ పండుగ సందర్భంగా ఇస్తున్నట్లు తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అయితే ప్రభుత్వం రిలీజ్ చేసిన క్యాలెండర్ లో ఫిబ్రవరి 8న సబ్ ఇ మెరాజ్ కి సెలవు ప్రకటించడం జరిగింది. అయితే దీనిని సాధారణ సెలవు కింద కాకుండా ఐచ్చిక సెలవ కింద పేర్కొనడం జరిగింది. కానీ ఇప్పుడు దీన్ని సాధారణ సెలవుగా మార్చింది. అయితే సబ్ ఇ మెరాజ్ ని ముస్లిం సోదరులు చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు.
ఇక ఆరోజు పర్వానా మసీదులకు దీపాలతో డెకరేషన్ చేసి రాత్రంతా జాగారం చేస్తూ వారి ప్రార్థనలు చేస్తారు. అలాగే ఇస్రా మిరాధుల కథ కూడా చెబుతారు. అయితే ఫిబ్రవరి 8న సాధారణ సెలవు అవడంతో ప్రభుత్వ కార్యాలయాలు మరియు పాఠశాలలు మూసి వేస్తున్నట్లు సమాచారం. అయితే ఫిబ్రవరి నెలలో సాధారణ సెలవు ఒకటి కూడా లేదు.సాధారణ సెలవులు జనవరి తర్వాత మళ్లీ మార్చి లోనే ఉంటాయి.
కానీ ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన సెలవు క్యాలెండర్ ప్రకారం మార్చి నెలలో 8వ తేదీన శివరాత్రి సందర్భంగా సెలవు ఉంటుంది. అదేవిధంగా మార్చి 25న హోలీ సందర్భంగా సెలవు ఉంటుంది. అలాగే మార్చి 29న గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవు ఇవ్వడం జరిగింది. అలాగే ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సెలవు ప్రకటించారు. ఇక ఏప్రిల్ 9న ఉగాది సెలవు. ఏప్రిల్ 11, 12న రంజాన్ సెలవులు ప్రకటించారు. అదేవిధంగా ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా , అలాగే ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా సెలవులు ప్రకటించారు.