Gruha Jyoti scheme : గృహ జ్యోతి పథకం పై నెలకొన్న సందిగ్ధత… మీటర్ రీడర్లు రివర్స్…

Gruha Jyoti scheme : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గృహ జ్యోతి పథకం అమలకు ఆటంకం ఏర్పడిందని చెప్పాలి. అయితే ప్రస్తుతం మీటర్ రీడర్లు రివర్స్ కావడంతో ఈ పథకం అమలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది అని తెలుస్తోంది. అయితే ఈరోజు నుండి గృహ జ్యోతి రిజిస్ట్రేషన్స్ కు కార్యచరణ మొదలవుతుందని రేవంత్ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అందజేస్తామని […]

  • Published On:
Gruha Jyoti scheme : గృహ జ్యోతి పథకం పై నెలకొన్న సందిగ్ధత… మీటర్ రీడర్లు రివర్స్…

Gruha Jyoti scheme : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గృహ జ్యోతి పథకం అమలకు ఆటంకం ఏర్పడిందని చెప్పాలి. అయితే ప్రస్తుతం మీటర్ రీడర్లు రివర్స్ కావడంతో ఈ పథకం అమలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది అని తెలుస్తోంది. అయితే ఈరోజు నుండి గృహ జ్యోతి రిజిస్ట్రేషన్స్ కు కార్యచరణ మొదలవుతుందని రేవంత్ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అందజేస్తామని వారు తెలియజేశారు. ఇక ఈ పథకం పై క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. అలాగే ప్రతి నెల మొదటి వారంలో పది రోజులు పాటు మీటర్ రీడింగ్ తో పాటు లబ్ధిదారుల గుర్తింపు కూడా ఉంటుందని తెలియజేశారు. అయితే ఈ పథకంలో లబ్ధిదారులను గుర్తించేందుకు మీటర్ రీడింగ్ తీసే సిబ్బందితోనే ఈ పని చేయించాల్సిందిగా నిర్ణయించారు.

ఈ క్రమంలోనే మీటర్ రీడర్ కు రేషన్ కార్డు ఆధార్ కార్డు నెంబర్లతో పాటు మొబైల్ నెంబర్ వంటి వివరాలు అందజేయాల్సిందిగా తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే బిల్లింగ్ లీడర్లకు ఈ రోజు నుండి రేషన్ కార్డ్ ఆధార్ సెల్ ఫోన్ నెంబర్లు కూడా ఎంట్రీ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై మీటర్ రీడర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వలన తమకు పని భారం బాగా పెరుగుతుందని కాబట్టి అదనంగా డబ్బులు చెల్లిస్తేనే ఈ పని చేస్తామంటూ మీటర్ రీడర్లు తేల్చి చెప్పేశారు. పనికి తగ్గ వేతనం చెల్లించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు రీడింగ్ లు తీసేది లేదంటూ పట్టు పట్టుకు కూర్చున్నారు. దీంతో ప్రస్తుతం గృహ జ్యోతి పథకం పై సందిగ్ధత నెలకొంది. మరి మీటర్ రీడర్ల డిమాండ్ పై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.