Medaram : మేడారం మహా జాతరకు ముందే బారులు తీరుతున్న భక్తులు…
Medaram : తెలంగాణ రాష్ట్రంలో మేడారం సమ్మక్క సారలక్క జాతరకు ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ మేడారం సమ్మక్క సారలక్క జాతరకు ఇంకా రెండు వారాల గడువు ఉంది. కానీ ప్రస్తుతం జాతరకు ముందే ప్రతి ఆదివారం రోజు వనదేవతల చెంత జన జాతర పెద్ద ఎత్తున సాగుతుంది అని చెప్పాలి. డిసెంబర్ జనవరి నెలల నుండి ప్రతి ఆదివారం కూడా జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అయితే జనవరి […]
Medaram : తెలంగాణ రాష్ట్రంలో మేడారం సమ్మక్క సారలక్క జాతరకు ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ మేడారం సమ్మక్క సారలక్క జాతరకు ఇంకా రెండు వారాల గడువు ఉంది. కానీ ప్రస్తుతం జాతరకు ముందే ప్రతి ఆదివారం రోజు వనదేవతల చెంత జన జాతర పెద్ద ఎత్తున సాగుతుంది అని చెప్పాలి. డిసెంబర్ జనవరి నెలల నుండి ప్రతి ఆదివారం కూడా జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అయితే జనవరి చివరి ఆదివారం రోజు దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు సమ్మక్క సారలక్కను దర్శించుకున్నట్లు సమాచారం. ఇక నిన్న అయితే ఆ సంఖ్య మూడున్నర లక్షలకు దాటినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.
అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మేడారం మహా జాతర ఈనెల 21 నుండి 24 వరకు జరగనుంది. ఇక ఈ మహా జాతరకు తెలంగాణ ఆంధ్ర ప్రజలు మాత్రమే కాకుండా ఒడిస్సా, ఝార్ఖండ్, మహారాష్ట్ర, చతిస్గడ్ వంటి దూర ప్రాంతాల నుండి కూడా ఎంతోమంది భక్తులు తరలివస్తారు. అయితే సమ్మక్క సారలక్క గిరిజనుల ఆరాధ్యదైవం కావడంతో ఈ జాతరలో ఎక్కువగా వారే కనిపిస్తారు. ఇక మూడు రోజులు జరిగే ఈ మహా జాతరకు భక్తులు కోట్ల సంఖ్యలో హాజరవుతారు. అందుకే ఈ జాతరను తెలంగాణలో జరిగే కుంభమేళా జాతరగా పిలుస్తుంటారు. ఇక ఈ మహా జాతరలో ఇసుక వేస్తే రాలనంత జనంతో కిలోమీటర్ల కొద్ది భారీ ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది.
దీంతో చాలామంది భక్తులు జాతరకు రెండు మూడు నెలల ముందే ఆలయానికి విచ్చేసి వారి మొక్కులు తీర్చుకుంటున్నారు. అయితే గతంతో పోల్చి చూస్తే జాతరకు రెండు మూడు నెలల ముందే భక్తులు ఇలా వచ్చి మొక్కులు తీర్చుకోవడం గత నాలుగేలుగా బాగా పెరిగిందని చెప్పాలి. ఇక ఈ సంవత్సరం అయితే అది మరింత ముదిరింది అని చెప్పాలి. ఇక నిన్నటి ఆదివారం రోజు వనదేవతల దర్శనానికి క్యూలైన్లలో భక్తులు బారులు తీరడంతో దర్శనానికి గంటలకు కొద్ది సమయం పట్టిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నిన్న రాత్రి 10 గంటల వరకు దర్శనాలు సాగాయి అంటే భక్తుల రద్దీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. జాతరకు ముందే ఇలా ఉంటే మహా జాతర జరిగే మూడు రోజులు భక్తుల రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయడం కష్టం అని చెప్పాలి.