Teenmaar Mallanna : కాంగ్రెస్ లోకి రానున్న తీన్మార్ మల్లన్న…అక్కడ నుండి పోటీ…

Teenmaar Mallanna  : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి జోరుగా కొనసాగుతుంది. ఇంకా నెల రోజులు గడువు మాత్రమే ఉండటంతో ఈసారి ఏ ప్రభుత్వం వస్తుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. అధికార పార్టీ టిఆర్ఎస్ వస్తుందా లేక వేరే పార్టీ వస్తుందా అనేది పక్కన పెడితే ప్రధాన పార్టీలు ప్రస్తుతం గెలుపు కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టే విధంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది. ఇక ఒక్కసారిగా […]

  • Published On:
Teenmaar Mallanna  : కాంగ్రెస్ లోకి రానున్న తీన్మార్ మల్లన్న…అక్కడ నుండి పోటీ…

Teenmaar Mallanna  : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి జోరుగా కొనసాగుతుంది. ఇంకా నెల రోజులు గడువు మాత్రమే ఉండటంతో ఈసారి ఏ ప్రభుత్వం వస్తుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. అధికార పార్టీ టిఆర్ఎస్ వస్తుందా లేక వేరే పార్టీ వస్తుందా అనేది పక్కన పెడితే ప్రధాన పార్టీలు ప్రస్తుతం గెలుపు కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టే విధంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది. ఇక ఒక్కసారిగా లైమ్ లైట్ కి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ వ్యూహాలను ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అదేవిధంగా అధికార పార్టీ టిఆర్ఎస్ కూడా తన వ్యూహాలను చూపిస్తూ వస్తుంది. అయితే ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లోకి నేతలు వెళ్లిపోవడం కాంగ్రెస్ కు కలిసి వచ్చిందని చెప్పాలి.

tinmar-mallanna-who-is-coming-to-congress

ఈ క్రమంలోనే కెసిఆర్ సర్కార్ పై ఎప్పుడు నిప్పులు చిమ్మి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నుండి కీలక నేతలు వచ్చి చేరగా వారిలో చాలామందికి టికెట్లు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్న కూడా ఒకప్పుడు మేడ్చల్ నుంచి పోటీ చేశారని వార్తలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు కొత్త పార్టీ పెడతారని వార్తలు కూడా వచ్చాయి. కానీ కెసిఆర్ ని ఓడించే సత్తా కేవలం కాంగ్రెస్ కు మాత్రమే ఉందని తీన్మార్ మల్లన్న భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే బిజెపిలో చేరిన తీన్మార్ మల్లన్న ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేశారు.

ఇక ఇప్పుడు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా లేక వేరే ఏదైనా ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ కూడా తీన్మార్ మల్లన్న పార్టీకి వస్తే మరింత బలం వస్తుందని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సిరిసిల్ల లేదా కామారెడ్డి నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే కెసిఆర్ లేదా కేటీఆర్ పై తన పోటీ చేసేందుకు మల్లన్న సిద్ధంగా ఉన్నారు. ఈ రెండు నియోజకవర్గాలలో ఏ టికెట్ ఇచ్చిన వెంటనే కాంగ్రెస్ లోకి చేరుతారని వార్తలు వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఈసారి తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్యే టికెట్ కాకుండా ఎన్నికల ప్రచారంలో భాగం చేసుకుని తర్వాత ఏదైనా పదవి ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి దీనికి తీన్మార్ మల్లన్న ఒప్పుకుంటారో లేదో వేచి చూడాలి.