Free Electricity : ఉచిత కరెంట్ పొందాలంటే బకాయిలు ఉండకూడదు…స్పష్టం చేసిన అధికారులు…

Free Electricity : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. అయితే ఇప్పటికే రెండు పథకాలను అమలు చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతోపాటు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద ఐదు లక్షలు బీమాను కల్పించారు. ఇక ఇప్పుడు మిగిలిన పథకాల అమలుపై దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులను కూడా స్వీకరించడం జరిగింది. అన్ని పథకాలకు ఒకే ఫోర్మ్ […]

  • Published On:
Free Electricity : ఉచిత కరెంట్ పొందాలంటే బకాయిలు ఉండకూడదు…స్పష్టం చేసిన అధికారులు…

Free Electricity : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. అయితే ఇప్పటికే రెండు పథకాలను అమలు చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతోపాటు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద ఐదు లక్షలు బీమాను కల్పించారు. ఇక ఇప్పుడు మిగిలిన పథకాల అమలుపై దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులను కూడా స్వీకరించడం జరిగింది. అన్ని పథకాలకు ఒకే ఫోర్మ్ తీసుకువచ్చి ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రజా పాలన ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అందరి నుండి దరఖాస్తులను స్వీకరించింది. అయితే స్వీకరించిన దరఖాస్తులను డిజిటలైట్ చేసిన తర్వాత డిజిటలైజ్ క్షేత్రస్థాయిలో అధికారులు ఇంటింటికి వెళ్లి దరఖాస్తుదారుల వివరాలను సేకరిస్తారు.

ఇక ఈ లబ్ధిదారుల ఎంపిక అనంతరం మహిళలకు 2500 , అలాగే 500 కే గ్యాస్ సిలిండర్ మరియు ఉచిత కరెంట్ వంటి పథకాలను అమలు చేస్తారట. అయితే దీనిలో ఉచిత కరెంట్ పథకానికి సంబంధించి కీలక వివరాలు బయటకు రావడం జరిగింది. అయితే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 200 యూనిట్లకి ఉచిత కరెంటు ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయాన్ని తమ మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చూపించింది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఉచిత కరెంట్ పథకం వర్తించాలంటే బకాయిలు ఉండకూడదని అధికారులు తెలియజేస్తున్నారు. దీనిలో భాగంగానే వీలైనంత త్వరగా పెండింగ్ బిల్లులు ఏమైనా ఉంటే క్లియర్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నారు.

అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పథకాలను అమలు చేస్తామని చెప్పడంతో చాలామంది డిసెంబర్ మరియు జనవరి నెలలో కరెంట్ బిల్లు కట్టలేదు. వారంతా కచ్చితంగా పెండింగ్ బిల్లులు కట్టాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. ఎలాంటి బకాయిలు లేని వారికి మాత్రమే ఉచిత కరెంటు ఇస్తామని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చినందున డిసెంబర్ జనవరి బిల్లులను మాఫీ చేయాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఉచిత కరెంటు పథకానికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. అదేవిధంగా ప్రజాపాలన దరఖాస్తులలో కూడా ఎన్ని యూనిట్ల కరెంటు వాడతారు , కనెక్షన్ నెంబర్ ఎంత అనే వివరాలను మాత్రమే అడిగారు.ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ వచ్చిన తర్వాతే ఈ పథకంపై పూర్తి వివరాలు తెలుస్తాయని స్పష్టమవుతుంది.