Sankranti holidays : విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం…ఎన్ని రోజులంటే..

Sankranti holidays  : జనవరి నెల వచ్చిందంటే చాలు స్కూల్ పిల్లలు మరియు కాలేజీ విద్యార్థులు హాలిడేస్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ఇక జనవరి నెలలో న్యూ ఇయర్ , సంక్రాంతి , రిపబ్లిక్ డే అంటూ పిల్లలకు కూడా ఎక్కువగా సెలవులు వస్తాయి. దీంతో పిల్లలు ఈ సెలవులను హ్యాపీగా ఎంజాయ్ చేసేందుకు ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఈసారి తెలంగాణలో సంక్రాంతి సెలవులు దాదాపు ఆరు రోజులు రానున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర […]

  • Published On:
Sankranti holidays : విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం…ఎన్ని రోజులంటే..

Sankranti holidays  : జనవరి నెల వచ్చిందంటే చాలు స్కూల్ పిల్లలు మరియు కాలేజీ విద్యార్థులు హాలిడేస్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ఇక జనవరి నెలలో న్యూ ఇయర్ , సంక్రాంతి , రిపబ్లిక్ డే అంటూ పిల్లలకు కూడా ఎక్కువగా సెలవులు వస్తాయి. దీంతో పిల్లలు ఈ సెలవులను హ్యాపీగా ఎంజాయ్ చేసేందుకు ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఈసారి తెలంగాణలో సంక్రాంతి సెలవులు దాదాపు ఆరు రోజులు రానున్నట్లుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలకు అలాగే ప్రైవేట్ పాఠశాలలకు 12 నుంచి 17 వరకు సెలవులు ప్రకటించడం జరిగింది. మిషనరీ పాఠశాలకు మినహాయించి అన్ని విద్యాసంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయని పాఠశాల విద్యా డైరెక్టర్ తెలియజేయడం జరిగింది.

ఇకపోతే ప్రభుత్వం ఇచ్చిన సెలవులలో జనవరి 12 ఆప్షనల్ హాలిడే ఉండగా13వ తేదీన రెండవ శనివారం కావడంతో చాలా పాఠశాలలకు హాలిడే ఉంటుంది. ఆ తర్వాత జనవరి 14న భోగి పండుగ ఆదివారం వచ్చింది. ఇక జనవరి 15 సోమవారం సంక్రాంతి పండుగ సందర్భంగా సాధారణ హాలిడేగా ప్రకటించారు. అదేవిధంగా జనవరి 16న కనుమ హాలిడే వచ్చింది. దీంతో మొత్తం 6 రోజులు విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు లభించాయి. ఇకపోతే జనవరి 25, 26 కూడా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.