Viral News : ప్రవళిక ఆత్మహత్య వెనుక అసలు కారణం….వైరల్ అవుతున్న సూసైడ్ లెటర్…

Viral News : ప్రస్తుత కాలంలో చాలామంది ప్రైవేట్ కంపెనీలు ఎన్ని ఉన్న ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కంటూ ఉంటారు. ఇక దానికోసం సొంత ఊరుని వదిలేసి పట్టణాలలో కోచింగ్ తీసుకుంటూ ఏళ్లకు ఏళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. కన్నవారి కలలను నిజం చేయాలని ఉద్యోగం సాధించి వారిని చాలా బాగా చూసుకోవాలని పగలు రాత్రి కష్టపడి మరి చదువుతుంటారు. ఇక అలా కష్టపడే వారికి ఉద్యోగాలు , నోటిఫికేషన్లు రాకపోతే ఆ బాధ చెప్పుకోలేనిది. […]

  • Published On:
Viral News : ప్రవళిక ఆత్మహత్య వెనుక అసలు కారణం….వైరల్ అవుతున్న సూసైడ్ లెటర్…

Viral News : ప్రస్తుత కాలంలో చాలామంది ప్రైవేట్ కంపెనీలు ఎన్ని ఉన్న ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కంటూ ఉంటారు. ఇక దానికోసం సొంత ఊరుని వదిలేసి పట్టణాలలో కోచింగ్ తీసుకుంటూ ఏళ్లకు ఏళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. కన్నవారి కలలను నిజం చేయాలని ఉద్యోగం సాధించి వారిని చాలా బాగా చూసుకోవాలని పగలు రాత్రి కష్టపడి మరి చదువుతుంటారు. ఇక అలా కష్టపడే వారికి ఉద్యోగాలు , నోటిఫికేషన్లు రాకపోతే ఆ బాధ చెప్పుకోలేనిది. అయితే అలాంటి అమ్మాయి గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఆమె పేరు ప్రవళిక (25). గ్రూప్ 2 ఉద్యోగం ఎలాగైనా సాధించాలనే కోరికతో కష్టపడి చదువుతుంది. తల్లిదండ్రులను సొంత గ్రామాన్ని వదిలి హైదరాబాద్ కు వచ్చి ఇక్కడే కోచింగ్ తీసుకుంటూ చదువుకుంటుంది.  అయితే ఇటీవల దానికి సంబంధించిన పరీక్షలు వాయిదా పడడంతో తీవ్ర నిరాశ చెందింది. దీంతో ఏకంగా తన ప్రాణాలను వదిలేసింది.

The real reason behind Pravalika's suicide...is the viral suicide letter.

హైదరాబాదులో తాను ఉంటున్న అశోక్ నగర్ హాస్టల్ లోనే సూసైడ్ చేసుకుంది. ఇక చనిపోయే ముందు ఆమె రాసిన సూసైడ్ లెటర్ ఇప్పుడు అందరికీ కన్నీరు తెప్పిస్తుంది. నన్ను క్షమించండి అమ్మ నేను చాలా నష్ట జాతకు రాలని..నావల్ల మీకు బాధ తప్ప మరి ఏమి లేదు. మీకు పుట్టడం నా అదృష్టం.మీరు నన్ను కాళ్లు కింద పెట్టకుండా చూసుకున్నారు. కానీ నేను మీకు చాలా అన్యాయం చేస్తున్నాను. నన్ను ఎవరు క్షమించరు. మీకోసం నేను ఏమి చేయలేకపోతున్నాను. అమ్మ నాన్న మీరిద్దరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అంటూ సూసైడ్ నోట్ రాసింది. ఇక ఈ సూసైడ్ నోట్ ను గమనిస్తే మనకు అర్థమవుతుంది ఆమె ఎంతటి మనస్థాపానికి గురైంది. తన తల్లిదండ్రులకు భారం కాకూడదని ఉద్యోగం సాధించి వారిని చూసుకోవాలనుకున్న ప్రవళిక తన కల ఎంతటికి నెరవేరకపోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

The real reason behind Pravalika's suicide...is the viral suicide letter.

దానికి తోడు ఉద్యోగ ప్రకటనలు రద్దవడం, వాయిదాలు పడుతూ ఉండడంతో ఆమె ఎంతో నిరాశ చెందినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తిరిగిరాని లోకానికి వెళ్లిపోయింది . ఇది ఎవరి పాపం…ఆమె మరణానికి ఎవరు బాధ్యులు అనేది చర్చించుకోదగిన విషయం. దీంతో ప్రవళిక మరణాన్ని ఖండిస్తూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్ వద్ద భారీ సంఖ్యలో విద్యార్థుల తరలివచ్చారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసే విద్యార్థులను చదరగొట్టి ఆమె మృతదేహాన్ని అక్కడినుండి ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం వరంగల్ లోని కుటుంబానికి ప్రవళిక మృతదేహాన్ని అప్పగించారు. ఇక ప్రవళిక మరణ వార్త పై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ప్రవళిక మృతి పట్ల అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.