Lulu Mall : లులు మాల్ ని లూటీ చేస్తున్న హైదరాబాద్ వాసులు…

Lulu Mall : ఇటీవల హైదరాబాద్ మహానగరంలో లులు మాల్ ను ఘనంగా ప్రారంభించడం జరిగింది. దీంతో ప్రస్తుతం హైదరాబాదులో ఎక్కడ విన్న లులు మాల్ పేరు గట్టిగా వినిపిస్తుంది. అయితే ఈ లులు మాల్ సెప్టెంబర్ 27న ప్రారంభించారు. ఇక ఏ ముహూర్తాన దీనిని ప్రారంభించారో తెలియదు కానీ దానిని వీక్షించేందుకు హైదరాబాద్ వాసులు వెలలో వస్తున్నారు. దీంతో ఆరంభం రోజు నుండి కూకట్ పల్లి వాసులకు చుక్కలు కనిపిస్తున్నాయి. అంతేకాక లాంగ్ వీకెండ్ అవడంతో […]

  • Published On:
Lulu Mall : లులు మాల్ ని లూటీ చేస్తున్న హైదరాబాద్ వాసులు…

Lulu Mall : ఇటీవల హైదరాబాద్ మహానగరంలో లులు మాల్ ను ఘనంగా ప్రారంభించడం జరిగింది. దీంతో ప్రస్తుతం హైదరాబాదులో ఎక్కడ విన్న లులు మాల్ పేరు గట్టిగా వినిపిస్తుంది. అయితే ఈ లులు మాల్ సెప్టెంబర్ 27న ప్రారంభించారు. ఇక ఏ ముహూర్తాన దీనిని ప్రారంభించారో తెలియదు కానీ దానిని వీక్షించేందుకు హైదరాబాద్ వాసులు వెలలో వస్తున్నారు. దీంతో ఆరంభం రోజు నుండి కూకట్ పల్లి వాసులకు చుక్కలు కనిపిస్తున్నాయి. అంతేకాక లాంగ్ వీకెండ్ అవడంతో ప్రజలు లులు మాల్ ను చూసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే స్థాయికి మించి ప్రజలు మాల్ కు రావడంతో హైటెక్ సిటీ నుంచి జేఎన్టీయూ మియాపూర్ ఎస్ఆర్ నగర్ వరకు ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోయాయి.అంతేకాక సృజన మాల్ వద్ద ఫ్లై ఓవర్ పై వాహనాలు నిలిపి మరి మాల్ సందర్శించడానికి వెళ్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు.

the-people-of-hyderabad-who-are-looting-lulu-mall

ఇది ఇలా ఉండగా తాజాగా లులు మాల్ అధికారులు అందించిన సమాచారం ప్రకారం.. ప్రజలు లులు మాల్ ను భారీ ఎత్తున లూటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మాల్ ను దర్శించడానికి వచ్చినవారు భారీ ఎత్తున సామాగ్రిని ద్వంశం చేయడమే కాక షాపింగ్ మాల్ లోని తిను బండారాలను తిని ప్యాకెట్లు పడేసి వెళ్ళిపోతున్నారు. దీంతో షాపింగ్ మాల్ లో సగం తినేసిన ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. అంతేకాక అక్కడ సామాగ్రిని కూడా పాడు చేసినట్లు మాల్ యాజమాన్యం చెబుతుంది. ఇక దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మాల్ లో సందర్శన కోసం ఉంచిన తినుబండారులు సైతం మాయం అవడంతో మాల్ యాజమాన్యం ఒక్కసారిగా షాక్ గురైంది. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.