Madhapur Kumari Aunty : పోలీసులు నన్ను కొట్టారు…

Madhapur Kumari Aunty  : కుమారి ఆంటీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా వినిపిస్తున్న పేరు.అయితే నిన్నటి వరకు కుమారి ఆంటీ దగ్గర 5 స్టార్ హోటల్ రేట్లు ఉన్నాయాంటూ ట్రోల్స్ చేశారు. ఆ తర్వాత ఆమె ఆదాయం గురించి చెప్పుకొచ్చారు. చిన్న చితక యూట్యూబ్ ఛానల్స్ నుండి మీడియా సంస్థలు వరకు ఆమె మీదే ఫోకస్ పెట్టారు. దీంతో నెట్టింటా కుమారి ఆంటీ తెగ వైరల్ అయిపోయారు. దానితో రోజుకి 300 ప్లేట్లు అమ్మే […]

  • Published On:
Madhapur Kumari Aunty : పోలీసులు నన్ను కొట్టారు…

Madhapur Kumari Aunty  : కుమారి ఆంటీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా వినిపిస్తున్న పేరు.అయితే నిన్నటి వరకు కుమారి ఆంటీ దగ్గర 5 స్టార్ హోటల్ రేట్లు ఉన్నాయాంటూ ట్రోల్స్ చేశారు. ఆ తర్వాత ఆమె ఆదాయం గురించి చెప్పుకొచ్చారు. చిన్న చితక యూట్యూబ్ ఛానల్స్ నుండి మీడియా సంస్థలు వరకు ఆమె మీదే ఫోకస్ పెట్టారు. దీంతో నెట్టింటా కుమారి ఆంటీ తెగ వైరల్ అయిపోయారు. దానితో రోజుకి 300 ప్లేట్లు అమ్మే కుమారి రోజుకి 500 ప్లేట్లు అమ్మే స్థాయికి ఎదిగారు. ఇక ఇప్పటిదాకా అంతా బాగానే ఉంది కాని ఒక్కసారిగా వచ్చిన విపరీతమైన క్రేజ్ ఇప్పుడు ఆమెకు అసలు ఉపాధి లేకుండా చేసింది. సోషల్ మీడియా సెన్సేషనల్ స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ కి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి , యూట్యూబర్స్ , సినిమా వాళ్ళు అంతా కలిసి ఆమెకు ఎక్కడ లేని క్రేజ్ తెచ్చిపెట్టారు.

ఆమె మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉంటుంది మన వల్ల ఇబ్బంది కాకూడదు ట్రాఫిక్ కి. మీ వల్ల మా వ్యాపారం పెరిగింది మీ అందరికీ కృతజ్ఞతలు అంటూ కూడా చెప్పింది. ఇప్పుడు ఆమె క్రేజ్ ఆమెకు అసలు ఉపాధి లేకుండా చేసింది ఫుడ్ విక్రయించేందుకు తన ట్రక్ లో ఉన్న ఐటమ్స్ ని తీసుకొని ఐటీసీ హోటల్ దగ్గరకు వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె ట్రక్ ను పోలీసులు అడ్డగించారు. ఆమె అక్కడ వ్యాపారం చేసేందుకు వీలు లేదని గట్టిగా చెప్పారు. ఆమె ట్రక్ అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. మొదట ఆ ట్రాక్ ని మళ్ళీ ఇస్తామని చెప్పారంట కానీ ఆ తర్వాత ఆ ట్రక్ ను సీజ్ చేసామని కుమారి ఆంటీ కొడుకు చెప్పాడు. అతనిపై చేయి చేసుకున్నారు అంటూ ఆరోపించాడు. అతనిని గట్టిగా అరుస్తూ చొక్కా పట్టుకుని అటు రారా అంటూ ఇటు రారా అంటూ లాగారని చెప్పాడు. చాలా దురుసుగా ప్రవర్తించారంటూ చెప్పాడు.

కుమారి ఆంటీ భర్త కూడా తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. బండిలో లక్ష రూపాయలు విలువ చేసే సరుకు ఉందని దానిని పోలీసులు సీజ్ చేశారని చెప్పారు. బండిని ఇస్తామని తీసుకెళ్లి తాళాలు వేసి సీజ్ చేశారని చెబుతూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుమారి ఆంటీ కూడా మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తాను రోజులో రెండు గంటలు మాత్రమే అక్కడ వ్యాపారం చేస్తారని చెప్పుకొచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆ వీధుల వ్యాపారం జరుగుతుందని ఆమె కేవలం రెండు గంటలు మాత్రమే ఉంటారని అందర్నీ వదిలేసి తన వ్యాపారాన్ని మాత్రమే అడ్డుకోవడం అన్యాయమని అని చెప్పారు. తనకి ఎలాగైనా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు పోలీసులు బాధ మరోలా ఉంది. ఇప్పటికిప్పుడు తీసుకున్న యాక్షన్ కాదంటూ పోలీసులు చెబుతున్నారు. ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందని ఎప్పటినుంచో చెప్తున్నామని చెప్పారు.