Revanth Reddy : పథకం ఏదైనా ఒకటే దరఖాస్తు…..

Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు ఒక దరఖాస్తు లోనే ఉంటుంది. వీటిని ఈనెల 28 నుంచి ప్రారంభం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా వార్డు సభల్లో ప్రజల్లో సమర్పించాల్సిన దరఖాస్తు ఫారాన్ని ప్రభుత్వ వర్గాలు సిద్ధం చేశాయి. అయితే దీనిని 27న దరఖాస్తు ఫారాన్ని విడుదల చేయనున్నారు. అభయ హస్తం పేరుతో రూపొందిన ఈ దరఖాస్తును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క […]

  • Published On:
Revanth Reddy : పథకం ఏదైనా ఒకటే దరఖాస్తు…..

Revanth Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు ఒక దరఖాస్తు లోనే ఉంటుంది. వీటిని ఈనెల 28 నుంచి ప్రారంభం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా వార్డు సభల్లో ప్రజల్లో సమర్పించాల్సిన దరఖాస్తు ఫారాన్ని ప్రభుత్వ వర్గాలు సిద్ధం చేశాయి. అయితే దీనిని 27న దరఖాస్తు ఫారాన్ని విడుదల చేయనున్నారు. అభయ హస్తం పేరుతో రూపొందిన ఈ దరఖాస్తును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క కలిసి దీనిని విడుదల చేయడం జరిగింది. అయితే ఈ దరఖాస్తు రెండు విభాలుగా ఉండబోతుంది. ఈ దరఖాస్తు ఫారం లో వ్యక్తిగత వివరాలతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధికి అవసరమయ్యే వివరాలు చేర్చాల్సి ఉంటుంది. మొదటి విభాగంలో; దరఖాస్తుదారిని పేరు (ఇంటి యజమాని)
లింగం
కులం
పుట్టిన తేదీ (ఆధార్ ప్రకారం)
ఆధార్ నెంబర్
మొబైల్ నెంబర్
వృత్తి
కుటుంబ సభ్యుల వివరాలు
చిరునామా
రేషన్ కార్డ్ నెంబర్, ఫోటోను కూడా జత చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మొదటి విభాగంలో ఉంటాయి. రెండవ విభాగంలో ఏ పథకం కింద లబ్ధి పొందాలనుకుంటున్నారో ఆ పథకానికి సంబంధించిన సమాచారం ఆ భాగంలో పొందుపరచాలి. ఈ దరఖాస్తు ఫారాన్ని ప్రభుత్వం ప్రతి గ్రామానికి వార్డులకు చేరుతాయి. ఈ దరఖాస్తులు బుధవారం లేదా గురువారం నుంచి అమలు జరిగే అవకాశం ఉంది.

తాజా వార్తలు | Breaking News LIVE | Today's Headlines in Telugu | Current Affairs | తెలుగు వార్తలు From India & Around The World at LatestLY తెలుగు

దరఖాస్తులు వివరాలు:

దరఖాస్తులో పొందుపరిచిన వివరాలు అన్ని నిజమేనని ధ్రువీకరిస్తూ సంతకం చేయాలి. ఈ ఫారం ను అధికారులకు అందించిన తర్వాత అధికారులు దరఖాస్తు స్వీకరించినట్లు రశీదు అందించాలి. ఏ పథకం కోసం ఏ వివరాలు ఇవ్వా లంటే…..
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ. 2.500 ఆర్థిక సహాయం కావాలంటే దరఖాస్తు ఫారంలో టిక్ చేయాల్సి ఉంటుంది.
~500 కే గ్యాస్ సిలిండర్ కోసం గ్యాస్ కనెక్షన్ నెంబర్ మరియు సరఫరా చేస్తున్న కంపెనీ సంవత్సరానికి వినియోగించే సిలిండర్ల సంఖ్యను పేర్కొనాలి.

CM Revanth Reddy About New Ration Card Application | ఇలా దరఖాస్తు చేయండి | New Ration Card - YouTube

రైతు భరోసా….

రైతు భరోసా పథకం కోసం సాగు రైతు లేదా కౌలు రైతు అని పేరు పేర్కొనాలి. సాగు రైతు అయితే దరఖాస్తులు పట్టాదారు పాస్ బుక్ నెంబర్ కౌలుదారు అయితే భూమి వివరాలు పొందుపరిచాలి. వ్యవసాయ కూలీ అయితే ఉపాధి హామీ కార్డు నెంబర్ రాయాల్సి ఉంటుంది.

ఇందిరమ్మ ఇండ్లు….

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు లేని వారి ఇంటి నిర్మాణం ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు ఫారంలో అన్ని రాసి ఉన్న చోట క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ కుటుంబం అమరవీరుల కుటుంబాలు ఉద్యమకారుల 250 గజాల ఇంటి స్థలం కోసం దరఖాస్తు చెయ్యాలి అంటే అమరవీరుడి పేరు అమరవీరుడైన సంవత్సరం
ఎఫ్ ఐ ఆర్ నెంబర్
డెత్ సర్టిఫికెట్ నెంబర్
దరఖాస్తు ఫారం లో సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఉద్యమకారులైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సందర్భంలో వారి మీద అయిన కేసు, తేదీ, సంఖ్య, జైలుకు వెళ్లి ఉంటే వాటి వివరాలు దరఖాస్తులో సమర్పించాల్సి ఉంటుంది.

గృహజ్యోతి:

గృహ జ్యోతి కింద నేలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందేందుకు విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబరు ఇవ్వాలి.
చేయూత పథకం కింద నెలకు రు. 4వేల పింఛన్ కోసం ఏ కేటగిరి వృద్ధాప్య, గీత కార్మికులు, డయాబెటిస్ బాధితులు, బీడీ కార్మికుల జీవన భృతి, ఒంటరి మహిళ జీవన భృతి, వితంతువు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, మలేరియా బాధితులు, బీడీ టేకేదారు జీవనభృతి, వీటిలో ఏ పింఛన్ కావాలో అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది.