Rythu Bandhu : ఇకపై వారికి రైతుబంధు కట్…ఎందుకంటే..

Rythu Bandhu  : ముందే చెబుతున్న సుమా… కాంగ్రెస్ గినక గెలిచింది అంటే రైతూ బంధుకు రాంరాం దళిత బంధు కి జై బిమ్ అని కొందరు… మన ప్రభుత్వం లేకుంటే పక్కా రైతు బందు ఆగిపోతుంది అని మీ ఇష్టం అని మరికొందరు… రైతూ బంధు రావాలి అంటే మళ్లీ మన సర్కార్ నే రావాలి అని కొందరు…. ఢిల్లీ పార్టీ కీ అధికారం ఇస్థిరా ఇక ఆ రైతూ బంధు ఆగిపోతుంది అని మరికొందరు […]

  • Published On:
Rythu Bandhu : ఇకపై వారికి రైతుబంధు కట్…ఎందుకంటే..

Rythu Bandhu  : ముందే చెబుతున్న సుమా… కాంగ్రెస్ గినక గెలిచింది అంటే రైతూ బంధుకు రాంరాం దళిత బంధు కి జై బిమ్ అని కొందరు… మన ప్రభుత్వం లేకుంటే పక్కా రైతు బందు ఆగిపోతుంది అని మీ ఇష్టం అని మరికొందరు… రైతూ బంధు రావాలి అంటే మళ్లీ మన సర్కార్ నే రావాలి అని కొందరు…. ఢిల్లీ పార్టీ కీ అధికారం ఇస్థిరా ఇక ఆ రైతూ బంధు ఆగిపోతుంది అని మరికొందరు ఇలా ఎలక్షన్ మీటింగ్ లో మొత్తం ఈ రైతు మందు డైలాగ్ లే… అయినప్పటికి సర్కార్ ను మార్చుకున్నారు పబ్లిక్.. మరి కొత్త ప్రభుత్వ హయం లో పెట్టుబడి ఫలితం వస్తుందా లేదా అంటే… టింగ్ టింగ్ మనీ ఫోన్ మోగుతూనే ఉన్నాయి. రైతుబంధు పడుతూనే ఉన్నాయి.

నిన్న 1 ఎకరా భూమి కలిగిన 22 లక్షల రైతుల ఎకౌంట్ లోకి 645 కోట్లు వేసింది గవ్నమెంట్. ఇక ఈ రోజు కొంత మంది కి పడ్డాయ్. అయితే పాత లెక్క ప్రకారం ఎకరానికి 5000 రైతులకి పడ్డాయి. కాని ఎలక్షన్ హామీ లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం అయితే ఎకరని కి 7500 రావాలి. అయితే కొత్త సర్కార్ ఇప్పుడే వచ్చింది కాబట్టి లెక్కలు అన్ని సరిచూసే సరికి ఆలస్యం అయితది అని పాత పద్దతిలోనే వేశారు. ఎట్లా అయితే 70 లక్ష మంది పెట్టుబడి సాయానికి రూ.7,720 కోట్ల పెట్టుబడి కావాలి. అదే 7,500 ఇస్తే 11 వేలు కోట్లు ఇవ్వాలి. అందుకే కొత్త సర్కార్ కొత్తగా ఆలోచనా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే 5 ఏకర లేదా 10 ఎక్కర లిమిట్ పెట్టీ వారికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్సి జీవన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పాస్ బుక్ లో ఎంత భూమి ఉంటే అంత ఇస్తున్నారు.

దునిన, దున్నకున్న , ఫామ్ హౌజ్ కట్టుకున్న సరే అకౌంట్ లొకి రైతుబంధు రూపంలో లక్షలకు లక్షలు డబ్బు వచ్చి పడుతుంది. అదే ఒక ఎకరం లేదా రెండు ఎకరాలు కలిగి ఉన్నవారికి కష్టపడి సాగు చేసే వారికి మాత్రం కేవలం 5000 10,000 మాత్రమే పడుతున్నాయి. ఇక వ్యాపార రంగంలో లక్షలకు లక్షల సంపాదిస్తున్న వారికి కూడా రైతు బంధు పడుతుంది. అయితే ఇలాంటి వారికి రైతుబంధు ఇవ్వడం దేనికి అనేది ప్రజల మాట.అలాగే గవర్నమెంట్ జాబులు చేసేవారికి కూడా రైతుబంధు అవసరం లేదని ప్రచారం కొనసాగుతుంది. అయితే ఇలాంటి వారికి ఇచ్చే డబ్బును కౌలు రైతులకు ఇచ్చే దిశగా ఆలోచన చేస్తుంది కొత్త ప్రభుత్వం. మరి దీనిపై దీనిపై కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.