Subsidy Gas Cylinder : రూ.500 కే గ్యాస్ సిలిండర్…ఈ పథకానికి అర్హులు ఎవరంటే…?

Subsidy Gas Cylinder : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూ.500 కే గ్యాస్ సిలిండర్ అనే పథకంపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక టోకెన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ టోకెన్ ఉన్నవారికి మాత్రమే గ్యాస్ సిలిండర్ అనేది రూ.500 రూపాయలకే ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రచారం చేసిన 6 గ్యారెంటీలను అమలు చేసే దిశగా చర్యలు […]

  • Published On:
Subsidy Gas Cylinder : రూ.500 కే గ్యాస్ సిలిండర్…ఈ పథకానికి అర్హులు ఎవరంటే…?

Subsidy Gas Cylinder : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూ.500 కే గ్యాస్ సిలిండర్ అనే పథకంపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక టోకెన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ టోకెన్ ఉన్నవారికి మాత్రమే గ్యాస్ సిలిండర్ అనేది రూ.500 రూపాయలకే ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రచారం చేసిన 6 గ్యారెంటీలను అమలు చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు . ఇప్పటికే ఆరు గ్యారెంటీలలో ఒకటైన మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సౌకర్యాన్ని తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అమలులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అదేవిధంగా చేయూత పథకం కింద రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిధి 10 లక్షలకు పెంచింది రేవంత్ రెడ్డి సర్కార్. కాగా మిగిలిన హామీలను కూడా వీలైనంత త్వరగా అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది.

congress gas cylinder Scheme

అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఒకటైన రూ.500 కే గ్యాస్ సిలిండర్ హామీని కూడా త్వరలోనే ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనికోసం ఇప్పటినుండి మహిళలు ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. అయితే అసలు పథకం ప్రారంభించక ముందే మహిళలు ఏజెన్సీల ముందు క్యూ కట్టడమేంటి అనుకుంటే..ఈ పథకం కోసం ఈ – కేవైసీ చేయించుకోవాల్సిందిగా వార్తలు వచ్చాయి. ఈ-కేవైసీ చేయించుకోపోతే సబ్సిడీ రాదని వార్తలు రావడంతో మహిళలందరూ తమ ఆధార్ కార్డులను పట్టుకుని గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ కట్టారు. అసలు విషయానికొస్తే కేంద్ర ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ తాజాగా ఈ-కేవైసీ చేసుకొని మహిళలందరూ వెంటనే చేసుకోవాల్సిందిగా ప్రకటించడం జరిగింది.

ఇక ఈ ప్రకటనకు రూ.500 కి గ్యాస్ సిలిండర్ పథకానికి లింకు ఉందని వార్తలు ప్రచారం కావడంతో మహిళలందరూ ఈ-కేవైసీ చేయించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే వాస్తవానికి కేంద్రం ప్రకటించిన ప్రకటనకు తెలంగాణలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కు ఎలాంటి సంబంధం లేదట. ఇక ఈ విషయాన్ని స్వయంగా గ్యాస్ ఏజెన్సీలు స్పష్టం చేస్తున్నాయి. అయితే కేంద్రం ఈ-కేవైసీ పూర్తికాని వారిని మాత్రమే పూర్తి చేసుకోమని ప్రకటించడం జరిగింది. అది కేవలం కేవైసీ పూర్తి కాని వారికి మాత్రమే అని తెలియజేసింది. కావున ఆల్రెడీ కేవైసీ పూర్తి చేసుకున్న వారు మళ్లీ ఈ-కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీలకి వెళ్లాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. కావున తెలంగాణలోని గ్యాస్ లబ్ధిదారులందరూ ఈ విషయాన్ని అవగాహనలో పెట్టుకొని గ్యాస్ ఏజెన్సీ వారికి సహకరించాల్సిందిగా కోరుతున్నారు.