Rythu Runa Mafi : రుణమాఫీ లపై రేవంత్ సంచలన నిర్ణయం…

Rythu Runa Mafi : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో దూకుడు ప్రదర్శిస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగానే ఇప్పటికే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం , ఆరోగ్యశ్రీ పరిధి పెంపు వంటి హామీలను అమలు చేయడం జరిగింది. అయితే తాజాగా రేషన్ కార్డులు జారీకి కూడా ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా మరో కీలకమైన హామీలను కూడా […]

  • Published On:
Rythu Runa Mafi : రుణమాఫీ లపై రేవంత్ సంచలన నిర్ణయం…

Rythu Runa Mafi : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో దూకుడు ప్రదర్శిస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగానే ఇప్పటికే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం , ఆరోగ్యశ్రీ పరిధి పెంపు వంటి హామీలను అమలు చేయడం జరిగింది. అయితే తాజాగా రేషన్ కార్డులు జారీకి కూడా ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా మరో కీలకమైన హామీలను కూడా అమలు చేసే దిశగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు దీనిని అమలు చేసే దిశగా రేవంత్ ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే రైతుల అప్పులను వడ్డీలను లెక్కపెట్టి రెండు లక్షల రుణమాఫీ చేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుని దీనిపై కసరత్తు చేయనున్నట్లుగా సమాచారం.

revanths-sensational-decision-on-rythu-runa-mafi

అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి దాదాపు 39 లక్షల మంది రైతులు బ్యాంకులో మరియు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో రుణాలను తీసుకుని ఉన్నారు. ఇక వీరు పెట్టుబడి కోసం తీసుకున్న అప్పులు మొత్తం దాదాపు 40 వేల కోట్లు ఉన్నట్లుగా అంచనా.ఒక్కో రైతు కుటుంబానికి రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుండగా వడ్డీ లెక్క కట్టి రెండు లక్షల వరకు మాఫీ చేయనున్నారు. అయితే రైతులకు 2 లక్షల లోపు అప్పు ఉన్నట్లయితే మొత్తం మాఫీ అవుతుంది. అంతకంటే ఎక్కువ అప్పు ఉన్నట్లయితే 2 లక్షల వరకు మాత్రమే మాఫీ చేయనున్నట్లు సమాచారం. ఈ విధంగా దాదాపు 32 వేల కోట్ల వరకు మాఫీ చేయాల్సి ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ నిధులను ఎలా సమీకరించాలనే అంశంపై ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.

ఈ నేపథ్యంలోనే బ్యాంకర్లతో మాట్లాడి…ప్రభుత్వమే వారి నుండి రుణం తీసుకునే విధంగా చర్చలు జరుగుతున్నాయి. దీని ద్వారా ముందుగా రైతుల పేరు మీద ఉన్న అప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వం పేరు మీదకి బదిలీ చేస్తారు. అనంతరం లాంగ్ టర్మ్ పెట్టుకొని వాయిదాల పద్ధతిలో ప్రభుత్వమే బ్యాంకులకు అసలు వడ్డీ కలిపి చెల్లిస్తుంది. ఇది ఇలా ఉండగా ఇప్పటికే అప్పుల కుప్పలో ఉన్న రాష్ట్రానికి కొత్త రుణాలు వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. అలాగే ఈ ప్రతిపాదనకు బ్యాంకుల అంగీకారం కూడా చెప్పాల్సి ఉంటుంది. మరి ఈ సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అధిరోహిస్తుందో వేచి చూడాలి.