Metro Train : మెట్రో విస్తరణ పై రేవంత్ సంచలన నిర్ణయం…

Metro Train : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన నాటినుండి తనదైన శైలిలో దూకుడుగా వ్యవహరిస్తూ పాలన కొనసాగిస్తున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే తాజాగా మరో సంచలన నిర్ణయం వైపుగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గత ప్రభుత్వం బిఆర్ఎస్ నిర్మించిన ఓఆర్ఆర్ మెట్రో ప్రాజెక్ట్ రద్దుచేసి ఔటర్ రింగ్ రోడ్డు వరకు మెట్రో […]

  • Published On:
Metro Train : మెట్రో విస్తరణ పై రేవంత్ సంచలన నిర్ణయం…

Metro Train : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన నాటినుండి తనదైన శైలిలో దూకుడుగా వ్యవహరిస్తూ పాలన కొనసాగిస్తున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే తాజాగా మరో సంచలన నిర్ణయం వైపుగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గత ప్రభుత్వం బిఆర్ఎస్ నిర్మించిన ఓఆర్ఆర్ మెట్రో ప్రాజెక్ట్ రద్దుచేసి ఔటర్ రింగ్ రోడ్డు వరకు మెట్రో అవసరం లేదని పాత బస్తీని విమానాశ్రమానికి అనుసంధానం చేయాలన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే గత ప్రభుత్వం బిఆర్ఎస్ హైదరాబాద్ నగరం చుట్టూ మెట్రో విస్తరించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దాదాపు 69 వేల కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో రైల్ ప్రాజెక్ట్ విస్తరణ కు క్యాబినెట్ లో గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

revanth-reddy-sensational-decision-on-metro-train

పటాన్ చేరువు నుండి నార్సింగ్ వరకు 22 కిలోమీటర్లు , అదేవిధంగా తుక్కుగూడ బెంగళూరు నుండి పెద్ద అంబర్ పేట్ వరకు 40 కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టును నిర్మించే దిశగా ప్రాజెక్టును ఖరార్ చేశారు. అలాగే మెట్రో కారిడార్ ను తార్నాక నుంచి ఈసీఎల్ వరకు 8 కిలోమీటర్లు మేడ్చల్ నుంచి పటాన్చెరువు వరకు 29 కిలోమీటర్లు , ఎల్బీనగర్ నుంచి పెద్ద అంబర్పేట్ వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టిఆర్ఎస్ ప్ర భుత్వం . అయితే వీటికి సంబంధించిన పనులన్నింటినీ మాజీ సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయగా ప్రస్తుతం ఈ పనులన్నీ టెండర్ దశలో ఉన్నాయి. అయితే గత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి బ్రేకులు వేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

revanth-reddy-sensational-decision-on-metro-train

ఈ నేపథ్యంలోనే ఓఆర్ఆర్ మెట్రో విస్తరణ ప్రాజెక్టుపై కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే తాజాగా ఎంఐఎం ఎమ్మెల్యే లతో సమావేశమైన రేవంత్ రెడ్డి పలు రకాల అభివృద్ధి పనులపై చర్చించి ఓఆర్ఆర్ మెట్రో విస్తరణ పై కూడా చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అవుటర్ రింగ్ రోడ్డు వరకు మెట్రో విస్తరణ చేయాల్సిన అవసరం లేదని రేవంత్ సర్కార్ అభిప్రాయ వ్యక్తం చేశారు. ఇది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు లబ్ధి చేకూర్చే దిశగా తీసుకున్న నిర్ణయం అని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టును రద్దుచేసి పాత బస్తీని విమానాశ్రయానికి అనుసంధానం చేయాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల రాలేదు కానీ త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్నారు.