Free Bus service : ఉచిత బస్సు ప్రయాణంపై తెలంగాణణ మహిళల స్పందన…మీరే చూడండి..

Free Bus service : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఆరు గ్యారెంటీలలో ఒకటైన మహాలక్ష్మి పథకాన్ని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్ నగరంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కలెక్టర్ రాజు గాంధీ హనుమంతు ప్రారంభించారు. అయితే ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు. […]

  • Published On:
Free Bus service : ఉచిత బస్సు ప్రయాణంపై తెలంగాణణ మహిళల స్పందన…మీరే చూడండి..

Free Bus service : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఆరు గ్యారెంటీలలో ఒకటైన మహాలక్ష్మి పథకాన్ని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్ నగరంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కలెక్టర్ రాజు గాంధీ హనుమంతు ప్రారంభించారు. అయితే ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు. అయితే ఆర్టీసీ లోని పల్లె వెలుగు మరియు ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మాత్రమే మహిళలు ఫ్రీగా ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ అధికారులు సూచనలు జారీ చేశారు.

అదేవిధంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి మరి ఇతర ఏదైనా తెలంగాణ రాష్ట్ర గుర్తింపు కార్డు కచ్చితంగా ఉండాలి. తెలంగాణ గుర్తింపు కార్డు ఉన్నవారు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా ప్రయాణం చేయగలరు అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలు వారి ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. మహిళలకు ఇలా ఉచితంగా బస్సులో ప్రయాణించే అవకాశం కల్పించడం నిజంగా చాలా ఆనందంగా ఉందంటూ వారు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు బస్సులో ప్రయాణం చేసేవారికి నెలకు దాదాపు 1500 వరకు ఆదావుతుందని తెలియజేస్తున్నారు. ఇలా ఆర్టీసీ ద్వారా ఆదా చేసుకున్న డబ్బుని ఇంట్లో ఉపయోగించుకుంటామని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.