RBI : రుణమాఫీల పైన కీలక ప్రకటన చేసిన RBI…అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన…

RBI  : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికలు హడావిడి జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికలు జరుగుతున్న ప్రతి ప్రాంతంలో రుణమాఫీ అనే పేరు ఎక్కువగా వినపడుతుంది. ప్రచారంలో భాగంగా రాజకీయ నాయకులు కూడా తాము అధికారంలోకి వస్తే రుణమాఫీలు చేస్తామంటూ హామీలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలను హెచ్చరిస్తూ ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతం ఈ ప్రకటన ప్రజలలో ప్రాధాన్యత సంతరించుకుంది. రుణమాఫీల పై […]

  • Published On:
RBI  : రుణమాఫీల పైన కీలక ప్రకటన చేసిన RBI…అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన…

RBI  : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికలు హడావిడి జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికలు జరుగుతున్న ప్రతి ప్రాంతంలో రుణమాఫీ అనే పేరు ఎక్కువగా వినపడుతుంది. ప్రచారంలో భాగంగా రాజకీయ నాయకులు కూడా తాము అధికారంలోకి వస్తే రుణమాఫీలు చేస్తామంటూ హామీలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలను హెచ్చరిస్తూ ఓ ప్రకటన విడుదల చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతం ఈ ప్రకటన ప్రజలలో ప్రాధాన్యత సంతరించుకుంది. రుణమాఫీల పై అనధికారికంగా చేస్తున్న ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిసెంబర్ 11న ఆర్బిఐ ప్రకటన విడుదల చేయడం జరిగింది.ఇక ఆ ప్రకటనలో భాగంగా ఇలాంటి ప్రచారాలను నమ్మి మోసపోవద్దని ఆర్.బి.ఐ ,ప్రజలకు సూచించింది. ఇలాంటి తప్పుడు , తప్పుదోవ పట్టించే ప్రచారాలు విని మోసపోవద్దని ఆర్.బి.ఐ పేర్కొంది. అంతేకాక అలాంటి తప్పుడు ప్రచారాలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాల్సిందిగా కోరింది.

rbi-makes-key-announcement-on-loan-waivers

అయితే రుణమాఫీలు చేస్తామంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలను గుర్తించిన క్రమంలో ప్రజలను హెచ్చరిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా కొన్ని సంస్థలు ప్రింట్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ఇలాంటి అనేక రకాల ప్రచారాలు చేస్తున్నాయి. ఎలాంటి అధికారిక గుర్తింపు లేకుండా రుణమాఫీ సర్టిఫికెట్లను జారీ చేస్తూ ,సర్వీస్ ఛార్జీలు లేదా లీగల్ ఫీజులను తీసుకుంటున్నట్లుగా తెలిపింది. అదేవిధంగా కొందరు వ్యక్తులు రుణమాఫీల పై తప్పుదోవ పట్టించేలా ప్రచారాలు చేయడంతో అది బ్యాంకుల రుణ వసూలు ప్రక్రియను బలహీన పరుస్తుందని , దీని కారణంగా చాలామంది బ్యాంకు లోన్ కట్టడం లేదని తెలియజేస్తుంది. ఇక ఈ చర్యలు ఫైనాన్షియల్ సంస్థల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తున్నట్లుగా ,ఇక దాని ప్రభావం డిపాజిటర్ల పైన పడుతున్నట్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరికలు జారీ చేసింది.

అదేవిధంగా గత కొన్ని ఏళ్లుగా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో లబ్ది పొందేందుకు రుణమాఫీ ప్రకటనలు చేస్తూ ఉండడంతో అది బ్యాంకు వ్యవస్థను దెబ్బతీస్తుందని ఆర్బిఐ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రుణమాఫీ ప్రకటించిన వెంటనే రుణాలు తీసుకున్న వారు నెలవారి వాయిదాలను చెల్లించడం మానేస్తున్నారు. దీని కారణంగా బ్యాంకులో నిరార్ధక ఆస్తుల విలువ గుట్టల పెరిగిపోతుందని ఆర్.బి.ఐ తెలియజేసింది. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా అధికార పగ్గాలను చేపట్టిన కాంగ్రెస్ పార్టీ కూడా రుణమాఫీలను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా దేశంలో చాలా చోట్ల ఎన్నికలు జరగగా అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు కూడా ఇలాంటి ప్రచారాలు చేశాయి. మరి ఆర్.బి.ఐ విడుదల చేసిన ప్రకటన దీనిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.