Munugodu : ఎమ్మెల్యే పిలుపుతో మునుగోడులో మద్యం బంద్…

Munugodu  : తెలంగాణ రాష్ట్రంలో తాజాగా బెల్ట్ షాపు లేని మునుగోడు ఆవిష్కృతమైంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపు కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని చెప్పాలి. మద్యపానానికి బానిసలైన ఎన్నో కుటుంబాలు అతలాకుతలమవుతున్నాయని తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే బెల్టు షాపులను రద్దు చేస్తానని మాట ఇచ్చిన కోమటిరెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. తన పదవి కంటే కూడా బెల్ట్ షాపుల నిర్మూలన ఎంతో ముఖ్యమని భావించిన కోమటిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే కార్యచరణ […]

  • Published On:
Munugodu : ఎమ్మెల్యే పిలుపుతో మునుగోడులో మద్యం బంద్…

Munugodu  : తెలంగాణ రాష్ట్రంలో తాజాగా బెల్ట్ షాపు లేని మునుగోడు ఆవిష్కృతమైంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపు కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని చెప్పాలి. మద్యపానానికి బానిసలైన ఎన్నో కుటుంబాలు అతలాకుతలమవుతున్నాయని తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే బెల్టు షాపులను రద్దు చేస్తానని మాట ఇచ్చిన కోమటిరెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు.

తన పదవి కంటే కూడా బెల్ట్ షాపుల నిర్మూలన ఎంతో ముఖ్యమని భావించిన కోమటిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే కార్యచరణ ప్రారంభించారు. దీనికోసం ప్రాణాలిక బద్ధంగా ముందుకు సాగిన ఎమ్మెల్యే నెలరోజుల వ్యవధిలోనే మునుగోడులో బెల్ట్ షాపులను నిర్మూలించారు. అయితే ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి గెలిచిన వెంటనే ఏడు మండలాల్లోని 159 గ్రామపంచాయతీలలో ,రెండు మండలాల పరిధిలోని 30 వార్డులలో బెల్ట్ షాపులను నిర్మూలించేందుకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు.  అంతేకాక దీనికోసం ప్రత్యేకంగా కమిటీలను కూడా ఏర్పాటు చేశాడు.

ఇక ఈ కమిటీలు బెల్ట్ షాపులను గుర్తించి వాటిని నడుపుతున్న వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇక దీనికోసం ఎక్సైజ్ మరియు పోలీస్ అధికారులు కూడా సహకరించినట్లు సమాచారం. అలాగే బెల్ట్ షాపులపై ఆధారపడి ఉన్న కుటుంబాల జాబితాను తెప్పించుకున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వారికి ప్రభుత్వపరంగా లేదా వ్యక్తిగతంగా సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. దీంతో వారు కూడా ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం స్వచ్ఛందంగా బెల్ట్ షాపుల నిర్వాహన నుండి తప్పుకున్నారు. దీంతో మునుగోడు పరిధిలో దాదాపు రెండు వేల బెల్ట్ షాపులు మూతపడినట్టు సమాచారం. అయితే తన పిలుపుకు సహకరించి బెల్ట్ షాపులను తీసేసిన కుటుంబాలను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్వయంగా వచ్చి కలవనున్నట్లు సమాచారం.