|KTR PPT On Telangana : కాలేశ్వరంపైకి సవాల్ విసిరిన కేటీఆర్….
|KTR PPT On Telangana : కాంగ్రెస్ శ్వేత పత్రంలో అన్ని తప్పులే అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్ లో శ్వేత పత్రం, విడుదల చేసిన సందర్భం గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కేటీఆర్. కాలేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతం అని దీని ద్వారా కాలువలు నిర్మించినట్లయితే 200 టీఎంసీలు నీళ్లు పొలాలకు పారెందుకు సిద్ధంగా ఉన్నాయని తెలియజేశారు. కాలేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజ్ లో ఏదో తప్పు జరిగినట్లుగా అధికార పార్టీ నిందిస్తుందని […]
|KTR PPT On Telangana : కాంగ్రెస్ శ్వేత పత్రంలో అన్ని తప్పులే అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్ లో శ్వేత పత్రం, విడుదల చేసిన సందర్భం గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కేటీఆర్. కాలేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతం అని దీని ద్వారా కాలువలు నిర్మించినట్లయితే 200 టీఎంసీలు నీళ్లు పొలాలకు పారెందుకు సిద్ధంగా ఉన్నాయని తెలియజేశారు. కాలేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజ్ లో ఏదో తప్పు జరిగినట్లుగా అధికార పార్టీ నిందిస్తుందని ఈ క్రమంలో ఎలాంటి విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాలేశ్వరం. మీరు ఎన్ని విధాలుగా బాధలం చేయాలని చూసిన వాస్తవాలు వాస్తవంగానే ఉంటాయి.
వి ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ది బెనిఫిట్స్ అఫ్ కాలేశ్వరం. దానిని మీరు కూడా దాచలేరు. నాలుగున్నర సంవత్సరాల లోనే దానిని పూర్తి చేసాం. దానిలో ఏదైనా నిర్మాణ లోపం ఉన్నట్లయితే సరి చేయండి. అలాగే జ్యూడిషియల్ విచారణ చేస్తాం జడ్జ్ చేస్తామని మీరు అన్నారు కదా. బారాబర్ చేసుకోండి తప్పు జరిగితే ఎలాంటి ఎంక్వైరీకి అయిన మేము సిద్ధం దానిలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ రాష్ట్ర ప్రజలు ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిందించే పరిస్థితి అలాగే ప్రపంచమంతా నిందించే పరిస్థితి దయచేసి తీసుకురాకండి. మాపైన రాజకీయ కక్షలు ఉంటే తీర్చుకోండి మమ్మల్ని తిట్టండి. రాష్ట్ర సంపదను జాతి సంపదను దయచేసి అవమానించకండి అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.