KCR : రేపే డిశ్చార్జ్ కానున్న కేసీఆర్…ఆసుపత్రి నుంచి నేరుగా వెళ్ళేది అక్కడికే…
KCR : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రస్తుతం సోమాజిగూడ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వారం రోజుల క్రితం తన ఫామ్ హౌస్ లో ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడటం వలన కెసిఆర్ తుంటి ఎముక విరగడం జరిగింది. ఈ క్రమంలోనే తీవ్ర అస్వస్థకు గురైన కెసిఆర్ ను కుటుంబ సభ్యులు యశోద ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో వైద్యులు ఆపరేషన్ నిర్వహించి శస్త్ర చికిత్స […]
KCR : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రస్తుతం సోమాజిగూడ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వారం రోజుల క్రితం తన ఫామ్ హౌస్ లో ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడటం వలన కెసిఆర్ తుంటి ఎముక విరగడం జరిగింది. ఈ క్రమంలోనే తీవ్ర అస్వస్థకు గురైన కెసిఆర్ ను కుటుంబ సభ్యులు యశోద ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో వైద్యులు ఆపరేషన్ నిర్వహించి శస్త్ర చికిత్స ద్వారా తుంటి ఎముక మార్పిడి చేశారు. ఇక మాజీ ముఖ్యమంత్రి కి ఇలా జరగడంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున యశోద ఆసుపత్రికి చేరుకొని కెసిఆర్ ను చూసేందుకు ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. అలాగే మాజీ ముఖ్యమంత్రి కి ఇలా జరగడంతో తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు పలువురు రాజకీయ నేతలు
మరియు సినీ ప్రముఖులు కేసీఆర్ ను చూసేందుకు యశోద హాస్పిటల్ చేరుకున్నారు. చంద్రబాబు నాయుడు ,చిరంజీవి చిన్న జీయర్ స్వామి, ప్రకాష్ రాజ్ ,నాగార్జున, భట్టి విక్రమార్క వంటి వారు యశోద ఆసుపత్రికి చేరుకుని కేసీఆర్ పరామర్శించడం జరిగింది. అలాగే కేటీఆర్ పలకరించి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఇక ఇప్పుడు కేసీఆర్ పూర్తిగా కోలులోవడం తో వైద్యులు ఆయనను ఇంటికి వెళ్లేందుకు అనుమతించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రేపు కేసీఆర్ ను డిశ్చార్జ్ చేయనున్నారు. దీంతో డిస్చార్జ్ అయిన అనంతరం ఆసుపత్రి నుంచి కేసీఆర్ నేరుగా నందినగర్ లోని తన నివాసానికి వెళ్ళనున్నట్లు సమాచారం. మరోవైపు కేసీఆర్ ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని డాక్టర్లు క్లారిటీ ఇచ్చారు.