New Ration Cards : కొత్త రేషన్ కార్డులు జారీకి కాంగ్రెస్ సర్కార్ కసరత్తు…

New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. తాము అధికారంలోకి వస్తే అర్హులైన వాళ్లందరికీ కచ్చితంగా రేషన్ కార్డులను జారీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాలలో హామీ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం పౌర సరఫరా శాఖ అధికారులతో మాట్లాడనున్నారు. […]

  • Published On:
New Ration Cards : కొత్త రేషన్ కార్డులు జారీకి కాంగ్రెస్ సర్కార్ కసరత్తు…

New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. తాము అధికారంలోకి వస్తే అర్హులైన వాళ్లందరికీ కచ్చితంగా రేషన్ కార్డులను జారీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాలలో హామీ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం పౌర సరఫరా శాఖ అధికారులతో మాట్లాడనున్నారు. అధికారులతో సమీక్ష అనంతరం కొత్త రేషన్ కార్డుల జారిపై నిర్ణయం తీసుకొనున్నారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీలను నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుంటుంది.

దీంతో ప్రజలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా రేషన్ కార్డులను జారీ చేస్తారని భావిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ సర్కార్ ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ప్రయోజనం పొందాలంటే రేషన్ కార్డ్ నెంబర్ తప్పనిసరిగా అవసరం అవుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చిన సంక్షేమ పథకాలు పొందాలంటే కూడా రేషన్ కార్డు తప్పనిసరి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో 2014 నుండి కొత్త రేషన్ కార్డులను జారీ చేయలేదు. కొత్త రేషన్ కార్డులను జారీ చేసి దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది. దీంతో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చాలానే పెండింగ్ లో ఉన్నాయి. వీటితోపాటు కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారు.

అదేవిధంగా కొందరు వారి పాత కార్డులలో కొత్త కుటుంబ సభ్యుల పేర్లను చేర్చేందుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయిన వారికి రేషన్ కార్డులు లేవు. ఈ క్రమంలోనే ఒక హైదరాబాద్ నగరంలోనే దాదాపు లక్ష 25 వేల మంది నుండి పౌర సరపర శాఖకు రేషన్ కార్డుల దరఖాస్తులు రావడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ఆమోదించిన పథకాలలో ఒకటైన మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 ఇవ్వాలన్న, 10 లక్షల రూపాయల ఆరోగ్య శ్రీ బీమా పథకాలు అందాలన్న , సన్న బియ్యం పంపిణీ ,ఇందిరమ్మ ఇల్లు , విద్యార్థులకు 5 లక్షల రూపాయల విద్య భరోసా , అందాలన్నా కచ్చితంగా రేషన్ కార్డు అవసరం అవుతుంది. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దరఖాస్తు చేసుకున్న వారితో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికిి కూడా కొత్త రేషన్ కార్డులు ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.